'K-ర్యాంప్'.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుసు కదా, డ్యూడ్ నిన్న విడుదల కాగా అంతకుముందు రోజు మిత్రమండలి వచ్చింది.;

Update: 2025-10-18 16:55 GMT

ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుసు కదా, డ్యూడ్ నిన్న విడుదల కాగా అంతకుముందు రోజు మిత్రమండలి వచ్చింది. ఇక టాక్ సంగతి ఎలా ఉన్నా సినిమాలకు ఓపెనింగ్స్ విషయంలో ఊహించని మార్పులు కనిపించాయి. ఇక డ్యూడ్ మంచి బజ్ తో మిగతా సినిమాల కంటే కాస్త ఎక్కువగా డామినేట్ చేయడం విశేషం.

ఇక పోటీలో శనివారం వచ్చిన సినిమా 'K-ర్యాంప్'. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదలకు ముందే మంచి ప్రమోషన్ స్ట్రాటజీతో ఓ వైబ్ అయితే క్రియేట్ చేశాడు. ఉదయం మిక్స్ డ్ టాక్ తో ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి అంతగా పాజిటివ్ టాక్ రాలేదు, సోషల్ మీడియాలో మిక్స్ డ్ టాక్ రావడంతో, ఈ పండగ రేసులో సినిమా నిలబడటం కష్టమేమో అనే టాక్ కూడా వచ్చింది.

కానీ, సాయంత్రం అయ్యేసరికి సీన్ అనూహ్యంగా రివర్స్ అయింది. రివ్యూలతో సంబంధం లేకుండా, బాక్సాఫీస్ వద్ద 'K-ర్యాంప్' సాయంత్రం షోల నుంచి అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లోని B, C సెంటర్లలో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రివ్యూలను పక్కనపెట్టి, మాస్ ఆడియన్స్ సినిమాను బాగానే చూస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, పలు చిన్న పట్టణాలలో నైట్ షోలు స్ట్రాంగ్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కొన్ని ఏరియాలలో డిమాండ్ బాగుండటంతో, అదనపు షోలు కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని థియేటర్ల వద్ద 'హౌస్ ఫుల్' బోర్డులు కూడా దర్శనమివ్వడం, ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయిందో చూపిస్తోంది. అయితే ఇలాంటి రెస్పాన్స్ కు ప్రధాన కారణం హీరో కిరణ్ అబ్బవరమే అని చెప్పాలి.

గ్రామీణ, చిన్న పట్టణాలలో అతను ముందు నుంచే సినిమాను బలంగా ప్రమోట్ చేశాడు. యువతలో అతనికి ఉన్న ఫాలోయింగ్, అతని ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. దీనికి తోడు, మాస్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యే 'K-ర్యాంప్' అనే టైటిల్ కూడా సినిమాకు అనుకూలంగా మారింది. అయితే, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌లో మాత్రం ఈ సందడి పెద్దగా కనిపించడం లేదు. సినిమాలోని లోకల్ ఫ్లేవర్, కమర్షియల్ అంశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పటికీ, పట్టణ ప్రాంత ప్రేక్షకులు సినిమా పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ఇది కిరణ్ అబ్బవరం మాస్ హీరోగా తన బలాన్ని నిరూపించుకుంటున్నాడని, కానీ క్లాస్ ఆడియన్స్‌ను చేరుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుందని సూచిస్తోంది.

మొత్తం మీద, 'K-ర్యాంప్' మొదటి రోజు సాయంత్రానికి టాక్ తో సంబంధం లేకుండా మాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ, అసలు సిసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. రేపు ఆదివారం, ఆ తర్వాత దీపావళి సెలవులు ఉన్నాయి. ఈ పండగ సీజన్‌లో ఇదే ఊపును కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ మౌత్ టాక్ సినిమాను ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News