జ్యోతి రాయ్ గ్లామర్ బ్లాస్ట్.. అలా చూస్తూ!

అయితే సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీ అవడంతో ఆ సీరియల్ నుంచి తప్పుకుంది జ్యోతి రాయ్.

Update: 2024-05-01 17:30 GMT

కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్.. ఒకే ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి, వసుధార ఎంత ఫేమస్ అయ్యారో.. ఆమె పోషించిన జగతి పాత్ర కూడా అంతే ఫేమస్ అయ్యింది. చీరకట్టుతో అమ్మ పాత్రలో, టీచర్ పాత్రలో ఎంతో పద్ధతిగా కనిపించింది. తన యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.


అయితే సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీ అవడంతో ఆ సీరియల్ నుంచి తప్పుకుంది జ్యోతి రాయ్. ఆమె పాత్రను రీప్లేస్ చేయడం ఇష్టం లేని మేకర్స్.. ఆ క్యారెక్టర్ ను చంపేసి ఆమె స్నేహితురాలి పాత్ర అంటూ అనుపమ అనే మరో క్యారెక్టర్ ను క్రియేట్ చేశారు. జ్యోతి రాయ్ లాగా ఆ రోల్ కు ఇంకెవరూ సెట్ కారని అలా చేసినట్లు టాక్. ఇటీవల ఓ యంగ్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది జ్యోతి రాయ్.


ఇక గత కొన్ని రోజుల నుంచి జ్యోతి రాయ్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. నెట్టింట హీట్ పుట్టించే ఫోటో షూట్స్ తో కుర్రకారును మైమరిపిస్తుంటోంది. తన అందాల ప్రదర్శనతో నెటిజన్లను నిద్ర పట్టకుండా చేస్తుంటోంది. పొట్టి బట్టలు, ట్రెండీ ఔట్ ఫిట్స్ లో వయ్యారాలు ఒలకబోస్తుంటోంది. తన గ్లామర్ షోతో నెటిజన్లను ఫిదా చేస్తుంటోంది. ఇటీవల కొత్త ఫొటోస్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది జ్యోతి రాయ్.

పొట్టి నిక్కరు, చిన్న టాప్ వేసుకున్న జ్యోతి రాయ్.. సోఫాలో కూర్చుని అందాలు ఆరబోసింది. బ్యాక్ గ్రౌండ్ లో ట్రెండీ మ్యూజిక్ పెట్టింది. తన చూపులతోనే మాయ చేస్తోంది. అదిరిపోయే పోజు ఇచ్చి సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం వైరల్ గా ఆమె ఫోటోలను చూసి నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నామని కామెంట్లు పెడుతున్నారు. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అంటూ సందడి చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

మాట రాని మౌనమిది, శుక్ర సినిమాల డైరెక్టర్‌ సుకు పుర్వాజ్‌ ను జ్యోతి రాయ్ రెండో పెళ్లి చేసుకుంది. ఏ మాస్టర్ పీస్ సినిమాను పూర్వాజ్ తెరకెక్కించగా.. జ్యోతి రాయ్ నటించింది. మూవీ టైమ్ లో ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత అమ్మడు నెట్టింట మరింత యాక్టివ్ గా ఉంటోంది. తన లుక్స్ తో కన్నడ ఇండస్ట్రీకి చెందిన మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ బ్యూటీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి

Tags:    

Similar News