• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్‌ వారసుడి...

సూపర్ స్టార్‌ వారసుడి సడెన్ సర్‌ప్రైజ్‌..!

| ప్రస్తుతం బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు

By - Tupaki Desk
Update: 2024-05-29 10:02 GMT

ఇండస్ట్రీ ఏదైనా వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్ విషయం. బాలీవుడ్‌ లో ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

చాలా రోజులుగా జునైద్ ఖాన్ సినిమా 'ఏక్‌ దిన్‌' కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఆ మధ్య జపాన్‌ లో జరిగింది. అందుకు సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్ బయటకు రావడం తో పాటు, సినిమా గురించి అనేక విషయాలు ప్రచారం జరిగాయి.

జునైద్‌ ఖాన్‌ తెరంగేట్రం 'ఏక్‌ దిన్‌' సినిమాతో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా, సడెన్‌ సర్‌ప్రైజ్ అన్నట్లుగా 'మహారాజ్‌' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ బడ్జెట్‌ తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమా ను డైరెక్ట్‌ గా నెట్‌ ఫ్లిక్స్ ద్వారా జూన్ 14న విడుదల చేయబోతున్నారు.

షాలినీ పాండే, జైదీప్‌ అహ్లావత్‌ మరియు శర్వరి లు కీలక పాత్రలో నటించారు. 19వ శతాబ్దపు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా లో జునైద్‌ ఖాన్‌ ను విభిన్నమైన లుక్ లో చూడబోతున్నామని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్‌ ను చూస్తే అర్థం అవుతుంది.

ఆడవారిపై జరిగే అఘాయిత్యాల గురించి వెలికి తీసే జర్నలిస్ట్‌ పాత్రలో జునైద్‌ ను చూడబోతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్న మహారాజ్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఏక్‌ దిన్ కు ముందు రాబోతున్న ఈ సినిమా జునైద్‌ ఖాన్‌ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.

Tags:    
  • Aamirkhanson 
  • Junaidkhan 
  • Maharajmovie 
  • Netflix 
  • Saipallavi 
  • Bollywood 
  • Junaidkhandebut 
  • Ekdinmovie 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS