ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలివే!
జులై నెలలో రెండో వారం కూడా వచ్చేసింది. ప్రతీ వారంలానే ఈ వారం కూడా కొత్త రిలీజులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.;
జులై నెలలో రెండో వారం కూడా వచ్చేసింది. ప్రతీ వారంలానే ఈ వారం కూడా కొత్త రిలీజులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు థియేటర్లలో రానుండగా మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో రిలీజవనున్నాయి.
ముందుగా ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాలేంటో చూద్దాం.
సుహాస్ హీరోగా తెరకెక్కిన ఓ భామ అయ్యో రామ,
మొగలి రేకులు సీరియల్ లో ఆర్‌కె నాయుడుగా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్న ఆర్‌కె సాగర్ ప్రధాన పాత్రలో నటించిన ది 100 జులై 11న రిలీజ్ కానున్నాయి.
వీటితో పాటూ వర్జిన్ బాయ్స్ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.
హాలీవుడ్ నుంచి జేమ్స్ గన్ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌మ్యాన్,
బాలీవుడ్ నుంచి రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా మాలిక్ కూడా జులై 11నే విడుదల అవుతున్నాయి.
ఇవి కాకుండా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
ఆప్ జై సా కోయి అనే బాలీవుడ్ సినిమా
సెవెన్స్ బేర్ అనే యానిమేషన్ ఫిల్మ్
జియామ్ అనే హాలీవుడ్ మూవీ
బ్రిక్ అనే ఇంగ్లీష్ సినిమా
జియో హాట్‌స్టార్‌లో..
స్పెషల్ ఓపీఎస్ అనే వెబ్‌సిరీస్ సీజన్2
మూన్ వాక్ మలయాళ మూవీ
సోనీలివ్‌లో..
నరివెట్ట అనే మలయాళం సినిమా
బుక్ మై షోలో..
గుడ్ వన్ అనే హాలీవుడ్ మూవీ