జూలై లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారమే!
జూన్ లో రిలీజ్ అయిన 'కుబేర' భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది.;
జూన్ లో రిలీజ్ అయిన 'కుబేర' భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఖర్చు పరంగా చూస్తే ? సినిమాకు పారితోషికాలు తప్ప ఇంకేం కనిపించలేదు. కాబట్టి భారీ ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక వెలవెలబోతున్న బాక్సాఫీస్ ను కుబేర కాస్త షేక్ చేసింది. మరి ఈ షేకింగ్ జూలైలో కూడా కొనసాగుతుందా? అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు.
జులై 4న యూత్ స్టార్ నితిన్ నటించిన 'తమ్ముడు'రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో సక్సెస్ కూడా నితిన్ కి అంతే అవసరం. సినిమాపై అతడు కూడా చాలా కాన్పి డెంట్ గా ఉన్నాడు. సక్సెస్ అందుకుని హిట్ రేసు లోకి రావాలని ఎదరు చూస్తున్నాడు. 'తమ్ముడు' టైటిల్ కూడా కలిసొస్తుంది. పవన్ అభిమాని...పైగా పవన్ సినిమా టైటిల్ కాబట్టి పీకే అభిమానులు ప్రోత్సహించే ఛాన్స్ లేకపోలేదు.
అటుపై జూలై 11న అనుష్క నటించిన 'ఘాటీ' రిలీజ్ అవుతుంది. అనుష్కను తెరపై చూసి నెలలు గడుస్తోంది. పవర్ పుల్ పాత్రలో చూసైతే కొన్ని సంవత్సరాలవుతుంది. అలాంటి అనుష్కను 'ఘాటీ'లో చూపిస్తుందని అంచనాలు భారీగా ఉన్నాయి. వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా కావడంతో హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఐదేళ్ల హరిహరవీరమల్లు నీరక్షణకు అదే నెల 24న తెర దించుతున్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన ఈసినిమా 24 న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. మొఘలలుపై వీరమల్లు తిరుగుబాటు ఎలా ఉంటుంది? అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న చిత్రం వందల కోట్లు వసూళ్లు సాధిస్తుందని అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'కింగ్ డమ్' కూడా అదే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు పూర్తవుతాయని టీమ్ భావిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.