బాలీవుడ్ లో తారక్.. ఈసారి సోలోగా!
అయితే తారక్ రోల్.. కేవలం వార్ 2 చిత్రానికే పరిమితం చేయకుండా, స్పై యూనివర్స్‌లో మరింత విస్తృత పరచాలని YRF సంస్థ యోచిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.;
బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో నార్త్ లో యమా క్రేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బీ టౌన్ లోకి సోలో మూవీతో ఎంట్రీ ఇచ్చేశారు. తనదైన ముద్ర వేసుకునేందుకు సిద్ధమైన తారక్.. ఇప్పుడు థియేటర్స్ లో వార్-2 మూవీతో సందడి చేస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా రిలీజైంది ఆ మూవీ.
ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఆ మూవీలో కీలక పాత్ర పోషించారు. విక్రమ్ రోల్ లో సందడి చేశారు. అయితే సినిమాలో తారక్ యాక్టింగ్ అండ్ ఎంట్రీ అదిరిపోయిందని నెటిజన్లు రివ్యూ ఇస్తున్నారు. డ్యాన్స్ కూడా సూపర్ అని అంతా చెబుతున్నారు.
అయితే తారక్ రోల్.. కేవలం వార్ 2 చిత్రానికే పరిమితం చేయకుండా, స్పై యూనివర్స్‌లో మరింత విస్తృత పరచాలని YRF సంస్థ యోచిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. స్పై యూనివర్స్ లో మిగతా సినిమాల్లో ఆయన ఒక అంతర్భాగం కానున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యష్ రాజ్ ఫిలింస్ తో తారక్ సోలో మూవీ చేయనున్నారని ఇప్పుడు నెట్టింట ప్రచారం జరుగుతోంది. యాక్షన్ డ్రామాగా ఆ సినిమా రానుందని ముందు వార్తలు రాగా.. అది కూడా స్పై యూనివర్స్ లో భాగమేనని ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో చర్చలు జరిపారని సమాచారం. అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయనున్నరని టాక్.
అయితే ఎన్టీఆర్ లైనప్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత దేవర సీక్వెల్ ను తారక్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల శివ.. మూవీ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం.
ఇంకా తారక్ లైనప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కూడా ఉంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో పవర్ ఫుల్ డివోషనల్ ఎలిమెంట్ తో ఆ మూవీ రానుంది. ఆ సినిమాతో జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో వర్క్ చేయనున్నారు. రీసెంట్ గా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా తారక్ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు యష్ రాజ్ ఫిలింస్ తో మరో మూవీ చేస్తారని తెలుస్తోంది. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు ఉంటుందో.. నిజమో కాదో వేచి చూడాలి.