వార్-2.. అంతకుమించి ఉంటేనే

టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్న సినిమా.. వార్-2. తన తరం స్టార్ హీరోల్లో ఇలాంటి భారీ చిత్రంతో హిందీలోకి డెబ్యూ చేస్తున్నది తారక్ మాత్రమే.;

Update: 2025-07-25 14:30 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్న సినిమా.. వార్-2. తన తరం స్టార్ హీరోల్లో ఇలాంటి భారీ చిత్రంతో హిందీలోకి డెబ్యూ చేస్తున్నది తారక్ మాత్రమే. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాలకు దేశవ్యాప్తంగా భారీగానే అభిమానులున్నారు. అందులోనూ ‘వార్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకోవడం తెలివైన నిర్ణయమే.

ఐతే ‘వార్-2’కు బాక్సాఫీస్ దగ్గర అంతా సాఫీగా సాగిపోతుందా అంటే.. ఔనని చెప్పలేని పరిస్థితి. ‘కూలీ’ లాంటి బంపర్ హైప్ తెచ్చుకున్న సినిమాతో ఇది పోటీ పడుతోంది. సౌత్ ఇండియాలో ‘కూలీ’ని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. ఆమిర్ ఖాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ‘కూలీ’ని ఉత్తరాదిన కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అన్నింటికీ మించి ‘వార్-2’ మీద ‘కూలీ’ ప్రస్తుతానికి పైచేయి సాధిస్తున్న విషయం.. క్యూరియాసిటీ.

‘కూలీ’ సినిమా కథేంటి.. అందులో రజినీ సహా ప్రధాన పాత్రధారుల క్యారెక్టర్లు ఎలా ఉంటాయి.. అనే విషయాలపై ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ఏ ప్రోమోలోనూ కథేంటన్నది రివీల్ చేయలేదు. నాగార్జున తొలిసారి విలన్ పాత్ర చేస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ ఏం క్యారెక్టర్లు చేస్తున్నారన్న దానిపై క్యూరియాసిటీ నెలకొంది.

ఇది సినిమాకు హైప్ పెంచుతోంది. పాటలు కూాడా సినిమాకు హైప్‌ను పెంచుతున్నాయి. కానీ ‘వార్-2’ విషయంలో ఇలాంటి హైప్, క్యూరియాసిటీ లేదన్నది వాస్తవం. ‘వార్’ను చూసిన వాళ్లందరికీ ‘వార్-2’ కథేంటో స్పష్టంగా అర్థమైపోతోంది. అసలు యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు స్పై యూనివర్స్ సినిమాలంటేనే ఒక ఫార్మాట్లో సాగిపోతాయనే అంచనా ఉంది.

ఏజెంట్‌గా సిన్సియర్‌గా పని చేసిన వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి హర్టయి దేశద్రోహిగా మారడం.. అతణ్ని పట్టుకోవడానికి మరో సిన్సియర్ ఏజెంట్ బరిలోకి దిగడం.. వీళ్లిద్దరి మధ్య పోరు.. ఈ లైన్లో నడిచే కథలే ఎక్కువ. ‘వార్-2’ ప్రోమోలు చూస్తే ఈ సినిమా కూడా అలాంటిదే అనిపిస్తోంది. ట్రైలర్ వరకు అంతకుమించి ఏమీ అనిపించలేదు. భారీ యాక్షన్ విందు మాత్రం ఖాయం అనిపిస్తోంది.

కానీ ఇలాంటి స్టోరీ లైన్‌తో ఎంత యాక్షన్ నింపినా ప్రేక్షకులు సంతృప్తి చెందరు. ట్రైలర్లో చూసిన దానికి మించి సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటేనే.. కథ పరంగా ఆశ్చర్యపరిస్తేనే ఆడియన్స్‌ థ్రిల్ అవుతారు. మరి అయాన్ ముఖర్జీ ఆగస్టు 14న ఎంతమేర ప్రేక్షకులను సర్పైజ్ చేస్తాడో చూడాలి.

Full View
Tags:    

Similar News