వార్ 2 సినిమాలో ఈ మూడే హైలైట్..

బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిలిమ్ వార్ 2 నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.;

Update: 2025-08-10 19:30 GMT

బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిలిమ్ వార్ 2 నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కీలక పాత్రలు పోషించారు. గతనెల ట్రైలర్ విడుదలవ్వగా.. మేకర్స్ ప్రమోషన్స్ కోసం ఏకంగా హీరోలనే రంగంలోకి దింపారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్లతోనే తారక్- హృతిక్ సినిమా ప్రమోట్ చేశారు.

అయితే సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అలాగే హీరోలు ఎన్టీఆర్- హృతిక్ మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆడియెన్స్ కు హై ఫీలింగ్ ఇస్తాయని అంటున్నారు. ఈ ఇద్దరు తలపడినప్పుడు థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో సినిమాపై హైప్ క్రియేట్ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మోస్ట్ హైలెటెడ్ సీన్స్ , ఎపిసోడ్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి అవేంటంటే.. ఇందులో మూడు మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. బహుషా ఈ మూడు కూడా తారక్- హృతిక్ తలపడినవే అంటున్నారు. ఈ మూడు ఎపిసోడ్స్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్తాయని అంటున్నారు.

అలాగే 1 సాంగ్ ప్రేక్షకులతో థియేటర్ హాలులో స్టెప్పులేయిస్తుందట. అది రీసెంట్ గా రిలీజైన సలామ్ అనాలి పాటనే. మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో తారక్ డ్యాన్స్ అదిరిపోయింది. ఆ గ్రేస్, స్టెప్పులు కేక అంతే. ఈ ఫుల్ పాట థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని మేకర్స ్చెప్పడం మరో హైప్. ఇక చివరగా సినిమా క్లైమాక్స్. ఇధి వేరే లెవెల్ లో ఉంటుందని బీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇలా ఈ మూడు అంశాలు సినిమాను ఇంకో స్థాయిలో నిలబెడతాయని అంటున్నారు.

కాగా, ఇందులో బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్ గా నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఓపెనింగ్ రోజు మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే వార్ 2 లాంగ్ రన్ లో ఈజీగా రూ.500 కోట్లు దాటేస్తుంది.

Tags:    

Similar News