యూర‌ఫ్ ట్రిప్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ & ఆలియా గ్యాంగ్!

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా మన స్టార్ హీరో హీరోయిన్లు తమ బిజీ షెడ్యూల్స్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి విదేశీ ట్రిప్‌లకు చెక్కేస్తుంటారు.

Update: 2026-10-06 18:01 GMT

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా మన స్టార్ హీరో హీరోయిన్లు తమ బిజీ షెడ్యూల్స్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి విదేశీ ట్రిప్‌లకు చెక్కేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్‌లో బిజీగా ఉండగా.. మరోవైపు బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ తన గర్ల్స్ గ్యాంగ్‌తో కలిసి స్పెయిన్ లోని సుందరమైన ప్రదేశాలను చుట్టేస్తున్నారు. ఒకే సమయంలో ఇద్దరు టాప్ స్టార్స్ యూరప్ వేదికగా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.




స్పెయిన్‌‌లోని అందమైన మెడిటరేనియన్ దీవి అయిన మల్లోర్కా లో తన స్నేహితురాళ్లతో కలిసి ఆలియా భట్ చిల్ అవుతున్నారు. అక్కడి అద్భుతమైన సముద్ర తీర ప్రాంతాలు, చారిత్రక యూరోపియన్ కట్టడాల నడుమ గడుపుతున్న మధుర జ్ఞాపకాలను ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ ట్రిప్ మధ్యలోనే తన ఇన్‌స్టాగ్రామ్ డిస్‌ప్లే పిక్చర్ (డీపీ) ను ఎర్రటి గౌను ధరించి సూర్యాస్తమయాన్ని ఆస్వాధిస్తున్న అద్భుతమైన ఫొటోగా మార్చడం విశేషం. దీనికంటే ముందు ఆలియా భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి అలీబాగ్ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.




ఇక టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం తన భార్య లక్ష్మీ ప్రణవితో కలిసి ఇటలీలో రిలాక్సింగ్ హాలిడేను ఆస్వాధిస్తున్నారు. తమ సన్నిహిత స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్లిన ఈ దంపతులకు సంబంధించిన క్యూట్ అండ్ క్యాండిడ్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ బిజీ సినిమా షెడ్యూల్స్.. ప్రమోషన్లతో తీరికలేకుండా గడిపే తారక్.. ఇలా దొరికిన చిన్న బ్రేక్‌ను తన సతీమణితో కలిసి విదేశాల్లో ప్రశాంతంగా గడుపుతూ రీఛార్జ్ అవుతుండటం నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సినిమాల పరంగా చూస్తే.. తారక్ తన కెరీర్‌లో వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇటీవలే హృతిక్ రోషన్‌తో కలిసి`వార్ 2` చిత్రంలో నటించి మెప్పించిన ఆయన ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ `డ్రాగన్` షూటింగ్ కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందన్న భారీ అంచనాలున్నాయి. ఇలాంటి భారీ షెడ్యూల్స్‌లోకి అడుగుపెట్టడానికి ముందే కుటుంబంతో కలిసి ఇలా యూరప్ ట్రిప్ వేయడం విశేషం. ఇక ఎన్టీఆర్ న‌టించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న సీత పాత్ర‌లో ఆలియా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

మొత్తానికి బిజీ లైఫ్‌స్టైల్‌ను పక్కన పెట్టి ఒకవైపు ఆలియా భట్ తన గర్ల్స్ గ్యాంగ్‌తో స్పెయిన్ అందాలను ఆస్వాదిస్తుంటే.. మరోవైపు తారక్-ప్ర‌ణ‌తి దంపతులు ఇటలీలో ఆహ్లాదకరమైన క్షణాలను గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా పర్సనల్ లైఫ్‌కు, కుటుంబానికి తగినంత సమయం కేటాయించడంలో ఈ స్టార్స్ ఎప్పుడూ ముందే ఉంటారని చెప్పడానికి ఈ యూరప్ ట్రిప్సే నిదర్శనం. ప్రస్తుతం వీరిద్దరి వెకేషన్ విశేషాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌‌లో నిలిచాయి. ఈ వారంలోనే వార‌ణాసి చిత్రీక‌ర‌ణ‌ను ముగించేసి.. మ‌హేష్ కూడా ఫ్యామిలీతో విదేశీ వెకేష‌న్ వెళ‌తార‌ని కూడా అప్పుడే గుస‌గుస మొద‌లైంది.

Tags:    

Similar News