మళ్లీ కంచరపాలెం గల్లీల్లోకి వెంకటేష్ మహా

కేరాఫ్ కంచరపాలెం లాంటి కల్ట్ క్లాసిక్ తో టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ వేసుకున్న దర్శకుడు వెంకటేష్ మహా.

Update: 2026-10-06 16:20 GMT

కేరాఫ్ కంచరపాలెం లాంటి కల్ట్ క్లాసిక్ తో టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ వేసుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. చాలా గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ తన సొంత గ్రౌండ్ కు తిరిగి వచ్చారు. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ కు అట్టహాసం అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మరోసారి చాలా న్యాచురల్, రూటెడ్ కథతోనే ఆయన వస్తున్నట్లు తెలుస్తోంది.




ఈసారి సినిమాను కూడా కంచరపాలెం నేపథ్యంలోనే నడిపించబోతున్నట్లు పోస్టర్ లోనే ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. కథలోని మెయిన్ ప్లాట్ పాయింట్ ను ఇప్పుడే బయటపెట్టకుండా, పాత్రలను పరిచయం చేస్తూ ఆడియన్స్ లో ఒకరకమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఈ ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు. వెంకటేష్ మహా తన గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ లోకల్ నేటివిటీని బలంగా నమ్ముకున్నట్లు విజువల్స్ చెబుతున్నాయి.

పోస్టర్ లోని క్యారెక్టర్ కాంబినేషన్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒక ఫ్రేమ్ లో స్టైలిష్ లుక్ చేతిలో బ్యాగ్ పట్టుకుని వెంకటేష్ మహా, చేతిలో టెడ్డీ బేర్ తో శ్రవంతి పీపకాయల కనిపించారు. మరో భాగంలో ఖాకీ టోపీ, చేతిలో లాఠీ పట్టుకుని కార్తీక్ రత్నం పక్కన సాంప్రదాయ లుక్ లో పావని కరణం జోడీగా దర్శనమిచ్చారు. ఈ రెండు జంటల మధ్య నడిచే రిలేషన్ షిప్, కంచరపాలెం వాతావరణంలో వీళ్లు ఎదుర్కొనే డ్రామా చుట్టూనే సినిమా తిరిగేలా కనిపిస్తోంది.

ఈ సినిమాకు వెంకటేష్ మహా కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ స్వయంగా ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. గతంలో కేరాఫ్ కంచరపాలెంలో జోసెఫ్ పాత్రతో మెప్పించిన కార్తీక్ రత్నం మరోసారి మహాతో కలవడం ఈ ప్రాజెక్ట్ కు ఒక పాజిటివ్ వైబ్ తెచ్చింది. పావని కరణం, శ్రవంతి పీపకాయల పాత్రలు కూడా నేచురల్ టచ్ తో కథకు బలంగా నిలిచేలా ఉన్నాయి.

టెక్నికల్ పరంగా చూసుకుంటే ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింత వరలక్ష్మి సమర్పణలో చింత గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింత నిర్మాతలుగా, చింత వినీషా రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక కంటెంట్ డ్రైవెన్ సినిమాకు తగినట్లుగానే ప్రొడక్షన్ వేల్యూస్ సెట్ చేసినట్లు కనిపిస్తోంది.

ఓవరాల్ గా అట్టహాసం ఫస్ట్ లుక్ ఎలాంటి అనవసరమైన హంగామా లేకుండా ఒక రా అండ్ రస్టిక్ ఫీల్ ను అందించింది. కంచరపాలెం లాంటి నేటివిటీని మరోసారి స్క్రీన్ పై చూడాలనుకునే సినిమా లవర్స్ కు ఇది మంచి ఆప్షన్ లా అనిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్ 2027లో థియేటర్లలోకి రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News