• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంద్రజ ఫాదర్ లవ్.....

ఇంద్రజ ఫాదర్ లవ్.. స్టేజ్‌ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కన్నీళ్లు

| సినిమా ఈవెంట్ లో సాధారణంగా సినిమా సక్సెస్, హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుతుంటారు.

By - M Prashanth
Update: 2026-10-06 16:21 GMT

సినిమా ఈవెంట్ లో సాధారణంగా సినిమా సక్సెస్, హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుతుంటారు. కానీ అనకాపల్లి సక్సెస్ మీట్‌ లో నిర్మాత లగడపాటి శ్రీధర్ మాత్రం సీనియర్ నటి ఇంద్రజ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ఆమె తన తండ్రిని చూసుకున్న తీరును గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన అనకాపల్లి సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సక్సెస్ అవ్వడంతో థాంక్యూ మీట్‌ నిర్వహించింది మూవీ టీమ్. ఆ సమయంలో నిర్మాత లగడపాటి శ్రీధర్ సినిమాలో ఇంద్రజ పోషించిన రోల్ తో పాటు ఆమె పర్సనాలిటీ గురించి కూడా మాట్లాడారు. అనకాపల్లి సినిమాకు అసలైన బిగ్గెస్ట్ స్టార్ ఇంద్రజ అని లగడపాటి శ్రీధర్ అన్నారు.

తెలుగు స్క్రీన్ పై జయసుధ తర్వాత అంతటి హుందాతనం, మంచి ఇమేజ్ ఉన్న నటి ఇంద్రజ అని ప్రశంసించారు. ఇప్పటికీ ఆమె హీరోయిన్‌ లాగే అందంగా కనిపిస్తున్నారని చెప్పారు. అలాంటి గ్లామర్, యాక్టింగ్ స్టామినా ఉన్న ఇంద్రజ ఇప్పటి జనరేషన్ హీరోలకు తల్లి పాత్రలు చేయడం తనకు కొంత బాధగా అనిపిస్తోందని లగడపాటి శ్రీధర్ అన్నారు. ఆమెకు ఇంకా మంచి లీడ్ రోల్స్ చేసే సత్తా ఉందని చెప్పారు.

అయితే కథకు, నటనకు ఆమె ఇచ్చే గౌరవం వల్లే అనకాపల్లిలో తల్లి పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంద్రజకు మరిన్ని మంచి తల్లి పాత్రలు రావాలని లగడపాటి కోరుకున్నారు. సౌత్ ఇండియన్ సినిమాల్లో జయసుధ తర్వాత గుర్తుండిపోయే తల్లి పాత్రలు చేసే స్థాయిలో ఇంద్రజ ఉన్నారని అన్నారు. ఇక ఇంద్రజ గురించి మాట్లాడిన సమయంలో లగడపాటి శ్రీధర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

గతంలో చెన్నై ఎయిర్‌ పోర్టులో ఇంద్రజ తన వృద్ధ తండ్రిని చూసుకున్న ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. వయసు మీద పడిన తండ్రిని ఆమె ఎంతో ప్రేమగా, చిన్నపిల్లాడిలా చూసుకున్నారని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయని, అలాంటి సమయంలో ఇంద్రజ తన తండ్రిపై చూపించిన ప్రేమ తనను కదిలించిందని లగడపాటి తెలిపారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ స్టేజ్‌ పైనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒక నటిగా ఇంద్రజ ఎంత గొప్పవారో, ఒక కూతురిగా కూడా ఆమె అంతే గొప్ప వ్యక్తి అని లగడపాటి శ్రీధర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో తన పర్సనల్ లైఫ్ లోని హ్యూమన్ యాంగిల్ గుర్తు చేసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే.. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆ సినిమాలో విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించారు. త్రినాథరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ఇంద్రజ కీలక పాత్రలో కనిపించారు. సినిమా విజయంతో మూవీ టీమ్ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది.



Tags:    
  • lagadapatisridhar 
  • indraja 
  • anakapalli 
  • vikramsahidev 
  • telugucinema 

Similar News

ఫైట్లు, బిల్డప్పులు లేకుండానే హీరోయిజం.. తెలుగులో దుల్కర్ సల్మాన్ స్టైలే వేరే!

2026-11-22 04:34 GMT

'హై' ట్రైలర్.. యూత్ కామెడీలో ఇన్ని ట్రాకులా!

2026-11-22 04:32 GMT

లవ్ లైఫ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మీనాక్షి చౌదరి..!

2026-11-22 04:31 GMT

పెళ్లి ప్ర‌త్య‌ర్థుల‌నైనా క‌లుపుతుంది.. ఇదిగో సాక్ష్యం!

2026-11-22 00:20 GMT

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో స్టార్‌ల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది ప్రముఖులా!

2026-11-22 00:00 GMT

'వడ చెన్నై' లో వెట్రీ మారన్ రాసిన ఆ సీన్ కి ఫిదా అయిపోయిన స్టార్ హీరోలు...

2026-11-21 23:59 GMT

JD సౌంద‌ర్యం, ఫిట్నెస్ సీక్రెట్ తెలిసొచ్చింది!

2026-11-21 23:59 GMT

సీతాదేవి పాత్ర‌పై విమ‌ర్శ‌లు.. 'ఇఫీ' వేదిక‌గా సాయిప‌ల్ల‌వి స‌మాధానం ఇదే!

2026-11-21 18:53 GMT

వేదం డైరెక్టర్ తో మళ్లీ జతకడుతున్న అల్లు అర్జున్!

2026-11-21 18:52 GMT

శ్రీలీలకు సపోర్ట్ గా హీరో కొడుకు.. ఆ రద్దిలో ఇలా..

2026-11-21 18:50 GMT

నితిన్ కెరీర్ బెస్ట్.. నాని మాట ఇంకా పెద్దదే!

2026-11-21 18:48 GMT

న‌న్ను తీర్చిదిద్ది స్టార్‌డ‌మ్ ఇచ్చింది ఆ ప‌రిశ్ర‌మే.. ర‌కుల్ మ‌న‌సు!

2026-11-21 18:48 GMT

Copyright @2026

Powered by Blink CMS