దేవ కట్టా 'జో జో' గ్లింప్స్.. నవ్వులతో వజ్రాల వేట మొదలైంది!
ఒక వజ్రం.. ఎన్నో ఆశలు.. అంతకుమించిన అత్యాశలు! ఎలాగైనా వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించే కొందరి చుట్టూ సాగే ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తోంది 'జో జో'.
ఒక వజ్రం.. ఎన్నో ఆశలు.. అంతకుమించిన అత్యాశలు! ఎలాగైనా వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించే కొందరి చుట్టూ సాగే ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తోంది 'జో జో'. విలేజ్ బ్యాక్ డ్రాప్, లవ్, కామెడీ, ఊహించని ట్విస్టులతో తెరకెక్కుతున్న ఆ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రీసెంట్ గా విడుదలైంది. దేవ కట్టా సమర్పణలో రూపొందుతున్న ఆ చిత్రానికి సంబంధించి 'కాషన్ 1' పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ హైప్ పెంచుతోంది.
జొన్నగిరిలోని డైమండ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో ఆ స్టోరీ సాగుతుంది. తమ జీవితాలను మార్చేయగల వజ్రం కోసం వేట మొదలుపెడతారు. ఆ వజ్రం దొరికితే తమ కష్టాలన్నీ తీరిపోతాయని, జీవితాలు మారిపోతాయని ఆశపడతారు. అయితే, వారు అనుకున్నంత ఈజీగా ఈ వేట సాగదు. ప్రేమ, అత్యాశ, మోసం, ప్రమాదాలు.. ఇలా అనేక ఇన్సిడెంట్స్ వారి జర్నీని ఊహించని మలుపులు తిప్పుతాయి.
ఇప్పుడు లేటెస్ట్ గ్లింప్స్ లో విలేజ్ ఎన్విరాన్మెంట్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. జొన్నగిరి ప్రాంతపు లైఫ్ స్టైల్ ను రిఫ్లెక్ట్ చేసేలా రోల్స్, పరిసరాలను నేచురల్ గా చూపించారు. స్లాంగ్ అండ్ బిహేవియర్ లో లోకల్ టచ్ కనిపిస్తోంది. బోల్డ్ డైలాగులు, కామెడీ గ్లింప్స్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, పల్లెటూరి జీవితాలను ఎంటర్టైనింగ్ గా చూపించే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది.
వజ్రం కోసం సాగే వేటలో ప్రేమ, సాహసం, నవ్వులు ఎలా కలుస్తాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. లీడ్ రోల్స్ లో కృష్ణ కమల్, మాహీ శ్రీ కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమతో పాటు, వజ్రం కోసం చేసే ప్రయత్నాలు కథలో మెయిన్ గా ఉండనున్నాయి. సీనియర్ నటుడు మకరంద్ దే శ్‌పాండే ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టుగా సాగుతూ మరింతగా ఎలివేట్ చేస్తోంది.
ఇక ఆ చిత్రానికి కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే అందిస్తున్నారు. గతంలో ఆయన రూపొందించిన మయసభ ఓటీటీ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు దేవ కట్టా సమర్పణలో 'జో జో'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విజయ బ్యానర్ పై విజయ్ కృష్ణ లింగమనేని సినిమాను నిర్మిస్తున్నారు.
ఫణీంద్ర దేవరపల్లి, వెంకటేష్, ప్రభావతి, మహబూబ్ బాషా, సతీష్ దేవట్టే, పూడూరు శరత్ బాబు తదితరులు ఇందులో నటిస్తున్నారు. రోహిత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మహేష్ శంకర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. రెహమాన్, శ్రీనివాస్ మౌళి, రామచంద్ర పాటలకు సాహిత్యం అందిస్తున్నారు. అయితే ఓ వజ్రం చుట్టూ తిరిగే ఆశలు, అత్యాశలు, ప్రేమ, కామెడీ సహా ఫ్రెష్ కంటెంట్ తో కూడిన ఇంట్రెస్టింగ్ మూవీగా 'జో జో' ఉండనున్నట్లు గ్లింప్స్ చెబుతోంది. మరి ఆ వజ్రాల వేట సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పంచుతుందో చూడాలి.