ధనుష్‌కి నచ్చనిది రాకీ భాయ్‌కి ఎలా నచ్చిందో..?
కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్ ఇటీవల 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్ ఇటీవల 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. కన్నడంలో కాస్త పర్వాలేదు అనిపించినా ఓవరాల్‌గా సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఉత్తర భారతంలో టాక్సిక్ సినిమా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. యశ్ ఈ సినిమాకు ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడు అంటూ విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు. నెగిటివ్ రివ్యూలు ఓ రేంజ్‌లో దక్కించుకున్న ఈ సినిమా వసూళ్ల విషయంలో బయ్యర్లకు రక్త కన్నీరు మిగిల్చింది అంటూ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో యశ్ తదుపరి సినిమా ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని టాక్సిక్ సినిమాను ప్రకటించిన యశ్ ఈసారి అంత ఎక్కువ గ్యాప్ లేకుండా వెంటనే కొత్త సినిమాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యశ్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో...
కన్నడ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, అలాగే తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వారు చెబుతున్న దాని ప్రకారం యశ్ కొత్త సినిమా ప్రముఖ దర్శకుడు మిత్రన్ దర్శకత్వంలో ఉండబోతుందట. పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో యశ్ సినిమాకు సంబందించి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయట. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ధనుష్ గతంలో ఒప్పుకున్న స్క్రిప్ట్, ఆ తర్వాత తప్పుకున్న సినిమానే యశ్ తో చేసేందుకు పీఎస్ మిత్రన్ రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ గతంలో ధనుష్ తో ఒక సినిమాను నిర్మించాలని భావించాడు. పీ ఎస్ మిత్రన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ మూవీ చర్చలు జరిగాయి. కానీ సినిమా కార్యరూపం దాల్చలేదు.
ధనుష్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో...
మొదట మిత్రన్ చెప్పిన స్క్రిప్ట్ కు ఓకే చెప్పిన ధనుష్, తానే స్వయంగా సంజయ్ లీలా భన్సాలీ వద్దకు మిత్రన్ ను తీసుకు వెళ్లి కథ చెప్పించడంతో పాటు, నిర్మాతగా ఒప్పించాడనే పుకార్లు వచ్చాయి. తీరా చూస్తే సినిమా పట్టాలు ఎక్కే ముందు ధనుష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ధనుష్ తప్పుకోవడంతో అదే స్క్రిప్ట్ ను యశ్ వద్దకు తీసుకు వెళ్లిన మిత్రన్, ఆయనతో ఓకే చెప్పించాడని సమాచారం అందుతోంది. ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు, అంతే కాకుండా సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో సినిమా అనుకున్నారు. కనుక ధనుష్ బిజీగా ఉండటం వల్ల లేదా భన్సాలీ మరేదైనా కారణం వల్ల సినిమా నుంచి తప్పుకుని ఉంటారా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ధనుష్ తో పీఎస్ మిత్రన్ జంగిల్ అడ్వెంచర్ మూవీని ప్లాన్ చేసుకున్నాడు, కానీ చివరి నిమిషంలో సినిమా క్యాన్సల్ అయింది.
ధనుష్ కథతో యశ్ సినిమా...
ధనుష్ కి చెప్పిన అదే జంగిల్ అడ్వంచర్ మూవీని ఇప్పుడు యశ్ తో చేసేందుకు పీఎస్ మిత్రన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి అడ్వంచర్ మూవీస్ కి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో కచ్చితంగా యశ్ తో పీఎస్ మిత్రన్ సినిమా చేస్తే భారీ విజయం దక్కడం ఖాయం అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. రాకీ భాయ్ కి టాక్సిక్ సినిమా తీవ్రంగా నిరాశను మిగిల్చింది. కనుక ఈసారి చేయబోతున్న సినిమా కచ్చితంగా కేజీఎఫ్ రేంజ్ లో ఉండాలని యశ్ కోరుకుంటున్నాడు. అందుకే ఈ భారీ యాక్షన్ అడ్వంచర్ ను కమిట్ అయ్యి ఉంటాడని అంటున్నారు. అయితే ధనుష్ కు నచ్చని కథను యశ్ ఎలా కమిట్ అయ్యాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ ధనుష్ కి కథ నచ్చక తప్పుకున్నట్లుగా క్లారిటీ లేదు, కాంబో సెట్ కాకపోవడం వల్ల ఆయన తప్పుకుని ఉంటాడు. కనుక యశ్ కి ఇది తప్పకుండా మంచి సినిమాగా నిలుస్తుందనే విశ్వాసం ను ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా సజావుగా సాగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమా సెట్స్ పైకి ఎక్కే అవకాశం ఉంది.