• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆయన ఎంట్రీ తో రూ.45 కోట్ల...

ఆయన ఎంట్రీ తో రూ.45 కోట్ల నుంచి రూ.95 కోట్లకి..!

| తాజాగా అమీర్ ఖాన్‌ నిర్మాతగా రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం లో సన్నీ డియోల్‌ ఒక భారీ సినిమాను రూపొందించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2023-10-03 11:30 GMT

బాలీవుడ్‌ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన స్టార్‌ హీరో సన్నీ డియోల్ అనడంలో సందేహం లేదు. అయితే గత దశాబ్ద కాలంగా సన్నీ డియోల్‌ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లి పోతూ ఉండేవి. దాంతో చాలా మంది సన్నీ డియోల్‌ గురించి మాట్లాడుకోవడం మానేశారు.. ఆయన సినిమాలు చూడటం మానేశారు. అలాంటి సమయంలో వచ్చిన 'గదర్‌ 2' సినిమా మొత్తం పరిస్థితిని మార్చేసింది.

సన్నీ డియోల్‌ గదర్‌ 2 సినిమా వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో మళ్లీ బాలీవుడ్ లో ఆయన సందడి మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సినిమాలకు సన్నీ డియోల్‌ కమిట్ అయ్యాడని తెలుస్తోంది. మొన్నటి వరకు పది నుంచి పదిహేను కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న సన్నీ డియోల్‌ ఇప్పుడు అయిదు నుండి పది రెట్లు పారితోషికం అందుకుంటున్నాడట.

తాజాగా అమీర్ ఖాన్‌ నిర్మాతగా రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం లో సన్నీ డియోల్‌ ఒక భారీ సినిమాను రూపొందించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవల ఖరారు అయింది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా కూడా ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యం లో ప్రముఖ ఓటీటీ ఈ సినిమా ను ఏకంగా రూ.95 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట.

సాధారణంగా అయితే 45 నుంచి 50 కోట్ల రూపాయలు ఓటీటీ రైట్స్ పలికితే గొప్ప విషయం. అలాంటిది సన్నీ డియోల్‌ మూవీ, ఆమీర్ ఖాన్‌ నిర్మాత అవ్వడం వల్ల జిస్నే లాహోర్‌ నహీ దేఖా సినిమా కి ఏకంగా 95 కోట్ల డీల్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా ఇంకా ప్రారంభం కాలేదు కనుక డీల్ క్లోజ్ చేయలేదు. ముందు ముందు మరింత ఈ మొత్తం పెరిగినా ఆశ్చర్యం లేదు.

సన్నీడియోల్‌, రాజ్‌ కుమార్ సంతోషి కాంబోలో మూడు సూపర్‌ హిట్ సినిమాలు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల పాతికేళ్లుగా వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబో లో మూవీగా జిస్నే లాహోర్‌ నహీ దేఖా రాబోతున్న నేపథ్యం లో విపరీతమైన క్రేజ్ ఉంది. పైగా అమీర్ ఖాన్ నిర్మాత అవ్వడం వల్ల అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందుకే ఓటీటీ రేటు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంది. ముందు ముందు భారీ డీల్స్‌ తో ఈ సినిమా రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    
  • Bollywood 
  • Sunnydeol 
  • Aamirkhan 
  • Jisnelahorenahidekha 
  • Movie 
  • Ottrights 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS