'గ్యాంగ్ లీడర్'లా జెలో బ్రేక్ డ్యాన్సులకు జనం గగ్గోలు
మళ్లీ ఇంతకాలానికి జెలో (జెన్నిఫర్ లోపేజ్) డ్యాన్సులకు జనం గగ్గోలు పెట్టడం చూస్తున్నాం. ఇది ఎక్కడ? అంటే.. ఇది ఇండియాలోనే... మంతెన వెడ్డింగ్ లో ఇది పాజిబులైంది.;
గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడులో మెగాస్టార్ బ్రేక్ డ్యాన్సులకు థియేటర్లలో విజిల్స్, గగ్గోలు పెట్టడం చూసాం. మళ్లీ ఇంతకాలానికి జెలో (జెన్నిఫర్ లోపేజ్) డ్యాన్సులకు జనం గగ్గోలు పెట్టడం చూస్తున్నాం. ఇది ఎక్కడ? అంటే.. ఇది ఇండియాలోనే... మంతెన వెడ్డింగ్ లో ఇది పాజిబులైంది.
ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన- టెక్ దిగ్గజం వంశీ గాదిరాజు పెళ్లి ఇటీవల రాజస్థాన్ ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా సాగిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పెళ్లి వేడుకల్లో జూనియర్ ట్రంప్ సహా ఎందరో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ స్టార్లు, పాప్ స్టార్లు పాల్గొన్నారు.
ఇక ఈ వేదికపై అంతర్జాతీయ పాప్ గాయని జెన్నిఫర్ లోపేజ్ డ్యాన్సింగ్ విన్యాసాలు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టాయి. ముఖ్యంగా ఈ వేదికపై జెలో ధరించిన దుస్తులు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అంతేకాదు.. పాపులర్ పాప్ గాయని జెలో ధరించిన దుస్తులు చాలా విమర్శలకు దారితీశాయి. ఉదయ్ పూర్ పెళ్లికి జెన్నిఫర్ నిప్పంటించింది! అంటూ కొందరు సాంప్రదాయవాదులు విరుచుకుపడుతున్నారు.
ఈ వీడియోలలో బాడీ హగ్గింగ్ డిజైనర్ దుస్తులలో జెన్నిఫర్ ఒంపు సొంపులు మెంటలెక్కించాయి. తాజాగా జెన్నిఫర్ నీలం, మెరిసే గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ దుస్తులను ధరించి కనిపించింది. జెలో నటించిన చాలా ఐకానిక్ పాప్ గీతాలను వేదికపై మరోసారి ప్రదర్శించింది. హోరెత్తించే మ్యూజిక్, అద్భుత నృత్యాలతో జెలో మతులు చెడగొట్టింది. అయితే భారతీయ వివాహంలో ఆమె ధరించిన దుస్తుల కారణంగా భారతీయ ప్రేక్షకులలో ఒక వర్గం నుండి నిరసనను ఎదుర్కొంది. ఇలాంటి ఎంపిక సరికాదని చాలా మంది వాపోతున్నారు. అయితే జెలోని ప్రశంసించే ఒక వర్గం మాస్ ఆడియెన్ కూడా లేకపోలేదు. చాలా మంది తెలుగు అభిమానులు జెన్నిఫర్ బ్రేక్ డ్యాన్సులకు అవాక్కయ్యారు. ఇవి గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లో మెగాస్టార్ బ్రేక్ డ్యాన్సులను తలపిస్తున్నాయంటూ కాంప్లిమెంట్లు కూడా ఇస్తున్నారు. జెలో షేకింగ్ బ్రేక్ డ్యాన్సులకు సంబంధించిన వీడియోలను వైరల్ చేస్తున్నారు.