పెళ్ల‌యిన‌ నిర్మాత‌ను పెళ్లాడాక న‌టి జీవితం

ఆమె ఒక సినీ ఫైనాన్షియ‌ర్ కుమార్తె. బాల‌న‌టిగా మొద‌లై అగ్ర నాయిక‌గా ఏలింది. రాజ‌కీయాల్లోను స‌త్తా చాటుకుంది.;

Update: 2025-08-22 00:30 GMT

ఆమె ఒక సినీ ఫైనాన్షియ‌ర్ కుమార్తె. బాల‌న‌టిగా మొద‌లై అగ్ర నాయిక‌గా ఏలింది. రాజ‌కీయాల్లోను స‌త్తా చాటుకుంది. ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ బ్యూటీగా వెలుగుతోంది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జీతేంద్ర, క‌మ‌ల్ హాస‌న్, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ‌, కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేసింది. సౌత్ - నార్త్ రెండు చోట్లా పాపుల‌ర్ క‌థానాయిక‌. 12 వ‌య‌సుకే న‌ట‌న ప్రారంభించి, కేవ‌లం రూ.10 పారితోషికంతో మొద‌లై, భార‌త‌దేశంలో పెద్ద స్టార్ గా ఎదిగిన ఈ న‌టి ఒక పెళ్ల‌యిన నిర్మాత‌ను పెళ్లాడింది. ఇది త‌న కెరీర్ ని డీప్ క్రైసిస్ లోకి నెట్టింది. ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. ది గ్రేట్ జ‌య‌ప్ర‌ద గురించే.

చిన్న‌ప్ప‌టి నుంచి నాట్య క‌ళ‌లో ఆరి తేరిన జ‌య‌ప్ర‌ద సినీ న‌టిగా ఆరంగేట్రం చేయ‌డం ఒక మేలి మ‌లుపు. చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న న‌టి జ‌య‌ప్ర‌ద‌. జితేంద్ర స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టించి పేరు తెచ్చుకుంది. ఈ జోడీ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. జయప్రద నటనకు లెక్క‌లేన‌న్ని పుర‌స్కారాలు ద‌క్కాయి. అవార్డులు రివార్డుల్లో రికార్డ్ బ్రేకింగ్ న‌టి.

అభిన‌య‌నేత్రి జయప్రద తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు హిందీ సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకుంది. శ్రీకాంత్ నహతాకు అప్పటికే వివాహమైంది. అతని మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు ఉన్నందున ఈ వివాహం ఆ సమయంలో హెడ్ లైన్స్ లో నిలిచింది. జయప్రదను పెళ్లాడిన తర్వాత కూడా శ్రీకాంత్ నహతా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. పెళ్లి తర్వాత జయప్రద నటనను వదులుకోలేదు కానీ ప‌రిశ్ర‌మ‌లో నిర్మాతలు ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించారు. ఇది త‌న‌ కెరీర్‌కు ముగింపుగా మారింది. శ్రీకాంత్ నహతా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇది జయప్రదతో అతని రిలేష‌న్‌షిప్ కి చాలా ఇబ్బందులు సృష్టించింది. ఇక జ‌య‌ప్ర‌ద రాజ‌కీయాల్లో చాలా కాలంగా ఉన్నారు. ఇటీవ‌ల పొలిటిక‌ల్ రైవ‌ల్రీ కార‌ణంగా జ‌య‌ప్ర‌ద కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని కూడా టాక్ ఉంది. యాధృచ్ఛికంగా జ‌య‌ప్ర‌ద రైవ‌ల్రీగా పేరు తెచ్చుకున్న అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూడా అప్ప‌టికే పెళ్ల‌యి పిల్ల‌లు ఉన్న నిర్మాత బోనీక‌పూర్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అయితే బోనీ అప‌రిమిత ప్ర‌య‌త్నాలు, బ‌ల‌వంతంతోనే శ్రీ‌దేవి కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో చివ‌రికి అత‌డిని పెళ్లాడార‌ని టాక్ ఉంది.

Tags:    

Similar News