పెద్ది జ‌పాన్ ఫ్యాన్స్ ఆ రేంజులో ప్ర‌చారం

తెలుగు స్టార్ల‌కు జ‌ప‌నీ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్క‌మ్ ఎప్పుడూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంది. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల‌తో ప్ర‌భాస్ కు జ‌పాన్ లో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-12-09 04:17 GMT

తెలుగు స్టార్ల‌కు జ‌ప‌నీ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్క‌మ్ ఎప్పుడూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంది. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల‌తో ప్ర‌భాస్ కు జ‌పాన్ లో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. జ‌ప‌నీ జాన‌ప‌ద సంస్కృతితో ముడిప‌డిన క‌థాంశాల‌కు రిలేటెడ్ గా ఉండ‌టంతో బాహుబ‌లి ప్ర‌భాస్ ని జ‌ప‌నీ అభిమానులు వోన్ చేసుకున్న వైనం ఆస‌క్తిని క‌లిగించింది. ప్ర‌భాస్ పై జ‌పాన్ ఫ్యాన్స్ అప‌రిమిత ప్రేమాభిమానాలు హృద‌యాల‌ను గెలుచుకుంటున్నాయి. ప్ర‌భాస్ న‌టించిన సినిమాల‌న్నీ జ‌పాన్ లో క‌చ్ఛితంగా రిలీజ‌వుతున్నాయి. మంచి వ‌సూళ్ల‌ను అందుకుంటున్నాయి.

ప్ర‌భాస్ త‌ర్వాత ఆర్ఆర్ఆర్ స్టార్లు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌కు కూడా జపాన్ లో భారీ ఫాలోయింగ్ పెరిగింది. బాహుబ‌లి త‌ర‌హాలోనే ఆర్.ఆర్.ఆర్ కూడా జ‌పాన్ లో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. జ‌పాన్ ప్ర‌మోషన్స్ స‌మ‌యంలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల‌పై ఫ్యాన్స్ ప్రేమాభిమానాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ రెగ్యుల‌ర్ గానే జ‌పాన్ విజిట్స్ కి వెళుతున్నారు. ఇక చ‌ర‌ణ్, ఎన్టీఆర్ డ్యాన్సుల‌ను జ‌ప‌నీ ఫ్యాన్స్ అమితంగా ఇష్ట‌ప‌డుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు ఐకానిక్ స్టెప్పుల‌ను జ‌ప‌నీ ఫ్యాన్స్ యూట్యూబ్ కోసం రీక్రియేట్ చేసి ఆనందించారు.

ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ `పెద్ది` ప్ర‌మోష‌న్స్ బాధ్య‌త‌ను కూడా జ‌పాన్ ఫ్యాన్స్ తీసుకున్న‌ట్టే కనిపిస్తోంది. ఇటీవ‌ల జ‌పాన్ టూర్ లో ఉన్న చ‌రణ్ అక్క‌డ త‌న అభిమానుల‌ను క‌లుసుకున్నారు. వారితో కొంత విలువైన‌ స‌మ‌యం గ‌డిపి ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. వారితో స‌ర‌దాగా సంభాషించారు. ఆ స‌మ‌యంలో త‌మ దేశానికి రాబోతున్న `పెద్ది`పై ప్రేమ‌ను కురిపించిన అభిమానులు `పెద్ది` టీష‌ర్ట్స్ ధ‌రించి క‌నిపించారు. పెద్ది పేప‌ర్ క‌టింగ్ లు, ఫ్ల‌కార్డులు, టైటిల్ తో క్రికెట్ బ్యాట్ ల‌ను ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

భార‌త‌దేశ పురాణేతిహాసాల‌కు సంబంధించిన క‌థ‌ల‌కు, జ‌ప‌నీ జాన‌ప‌ద క‌థ‌ల‌కు మ‌ధ్య అంతో ఇంతో రిలేటివిటీ ఉండ‌టం వ‌ల్ల‌నే వారికి మ‌న సినిమా క‌థ‌లు న‌చ్చుతున్నాయి. మ‌న స్టార్ల న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు ఫిదా అయిపోతున్నారు. పెద్ది క్రీడా నేప‌థ్య సినిమా కావ‌డంతో జ‌ప‌నీ ఫ్యాన్స్ కి మ‌రింత బాగా న‌చ్చుతుంద‌నే ఆశిద్దాం. ఈ చిత్రానికి బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జాన్వీ క‌పూర్ అంద‌చందాలు, హొయ‌లుకు జ‌ప‌నీ బోయ్స్ పడిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అథ్లెటిక్స్ లో భారీగా క‌ప్ లు గెలుచుకునే జ‌ప‌నీలకు క్రీడానేప‌థ్య చిత్రాల‌తో క‌నెక్టివిటీ బాగానే ఉంటుంది. ఆ ర‌కంగా చ‌ర‌ణ్ సినిమాకు జ‌పాన్ లో మంచి వ‌సూళ్లు ద‌క్కుతాయ‌ని ఆశిస్తున్నారు. ఇటీవ‌ల విడులైన చికిరీ చికిరీ పాట ఇంట‌ర్నెట్ లో దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఏ.ఆర్.రెహ‌మాన్ బాణీ యూత్ లోకి దూసుకెళ్లింది.

పెద్దికి పోటీగా నాని ప్యార‌డైజ్?

ఓవైపు పెద్ది చిత్రాన్ని వ‌చ్చే స‌మ్మ‌ర్ లో చిత్ర‌బృందం భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తుంటే పోటీగా నాని న‌టించిన ప్యార‌డైజ్ విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌చార‌మైంది. 26 మార్చి 2025న ప్యార‌డైజ్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు దీనిని వాయిదా వేసేందుకు అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. మే నెల‌లో ప్యార‌డైజ్ ని సోలోగా రిలీజ్ చేయాల‌ని నాని బృందం భావిస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. చ‌ర‌ణ్ పెద్ది మార్చి 27న విడుద‌ల‌కు షెడ్యూల్ చేయ‌గా, రెండు సినిమాల క్లాష్ లేకుండానే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే `ప్యార‌డైజ్` నిర్మాత‌లు అధికారికంగా దీనిని ధృవీక‌రించాల్సి ఉంటుంది.




Tags:    

Similar News