జాన్వీ నెక్స్ట్ టార్గెట్ వీళ్లేనా?
మరి జాన్వీ లిస్ట్ లో మిగిలిన పాన్ ఇండియా హీరోలు ఎవరు అంటే మహేష్...ప్రభాస్ మాత్రమే.;
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ కెరీర్ కి తిరుగు లేదు. మామ్ బ్రాండ్ తో మంచి అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే 'దేవర'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడీగా నటించింది. 'దేవర2' లోనూ అమ్మడు కొనసాగుతుంది. 'దేవర' సెట్స్ లో ఉండగానే ఆర్సీ 16లో నూ ఛాన్స్ అందు కుంది. ప్రస్తుతం రామ్ చరణ్ కి హీరోగా 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. ఇందులో జాన్వీ ఎలా కనిపించ బోతుంది? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఇలా కెరీర్ ఆరంభంలోనే అప్పుడే ఇద్దరు పాన్ ఇండియా హీరోల్ని చుట్టేసింది. మరి జాన్వీ కపూర్ నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న పేర్లేంటి? అంటే ఆ హీరోలు వీళ్లే. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రంలో ఈ భామనే ఎంపిక చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అట్లీ అమ్మడికి అద్భుతమైన రోల్ రాసాడని వినిపిస్తుంది. ఈ ఛాన్స్ నిజమైతే జాన్వీకి తిరుగుండదు. మరో ఐదారేళ్లు దర్జాగా బండి లాగించొచ్చు.
మరి జాన్వీ లిస్ట్ లో మిగిలిన పాన్ ఇండియా హీరోలు ఎవరు అంటే మహేష్...ప్రభాస్ మాత్రమే. ఇంత వరకూ వాళ్లతో నటిస్తున్నట్లు ఎక్కడా వార్త రాలేదు. మహేష్ హీరోగా రాజమౌళి ఓ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా నటిస్తోంది. హీరోయిన్? పాత్ర...ప్రతి నాయిక పాత్ర అన్నది క్లారిటీ లేదు. ఒకవేళ విలనీ అయితే హీరోయిన్ గా జాన్వీకి ఆప్షన్ గా ఉండే ఛాన్స్ లేకపోలేదు.
మహేష్..జాన్వీ ఆన్ స్క్రీన్ కాంబినేషన్ అదిరిపోతుంది. అలాగే ప్రభాస్ కూడా జాన్వీ లిస్ట్ లో ఉన్నాడు. ప్రస్తుతం 'పౌజీ'..'రాజాసాబ్' ల్లో నటిస్తున్నాడు. వాటిలో జాన్వీకి ఛాన్స్ లేదు కానీ. డార్లింగ్ చేసే తదుపరి సినిమల్లో జాన్వీకి ఛాన్స్ లేకపోలేదు. డార్లింగ్ కటౌట్ ని మ్యాచ్ చేయడం కష్టమైనా మ్యానేజ్ చేయగ ల్గతుంది. వీళ్లందర్నీ జాన్వీ కవర్ చేయగల్గితే టాలీవుడ్ లో మిషన్ కంప్లీట్ అయినట్లే.