ఎన్టీఆర్-చ‌ర‌ణ్ త‌ర్వాత శింబుతో.. జాన్వీ కోలీవుడ్‌కి

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ కపూర్ సౌత్‌లో వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది

Update: 2024-05-23 05:15 GMT

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ కపూర్ సౌత్‌లో వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. కెరీర్ ఆరంభ‌మే టాలీవుడ్ సూప‌ర్ స్టార్లు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. దేవ‌ర‌లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న జాన్వీ, త‌దుప‌రి చ‌ర‌ణ్ - బుచ్చిబాబు చిత్రంలోను న‌టిస్తోంది. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ తెర‌కెక్కిస్తే అందులో క‌చ్ఛితంగా జాన్వీ క‌థానాయిక అని చ‌ర‌ణ్ క‌న్ఫామ్ చేసాడు. దీనికోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నార‌ని బుచ్చిబాబుతో సినిమా లాంచ్ లో చ‌ర‌ణ్ స్వ‌యంగా అన్నారు.

అదంతా అటుంచితే జాన్వీ ఇప్పుడు కోలీవుడ్ లోను అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌తిభావంతుడైన సిలంబరసన్ అలియాస్ శింబు సరసన STR 48తో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శింబు తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు దేశింగ్ పెరియసామితో చేతులు కలిపాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా STR 48 అని పేరు పెట్టారు. ఏడాది క్రిత‌మే ప్రారంభ‌మైన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనికి ఎక్కువ సమయం పట్టింది.

Read more!

సోషల్ మీడియాలో తాజా సంచలనం ప్రకారం...STR 48లో క‌థానాయిక‌ల‌ పాత్ర కోసం ఇద్దరు బాలీవుడ్ నటీమణులతో చర్చలు జరుపుతున్నార‌ని తెలిసింది. నిర్మాతలు శింబు సరసన న‌టించేందుకు బాలీవుడ్ నటీమణులు జాన్వీ కపూర్, కియారా అద్వానీతో చర్చలు జరుపుతున్నారని స‌మాచారం. వారు ఇద్దరు నటీమణులతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో న‌టించాల్సిందిగా చ‌ర్చించిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికి అవ‌కాశం అన్న‌ది తేలాల్సి ఉంది. వారికి ఇది కోలీవుడ్ ఆరంగేట్రం అవుతుంది. ఈ ఇద్దరు నటీమణులు తమ తమిళ సినిమా ఎంట్రీ కోసం చాలా కాలం పాటు వేచి ఉన్నందున అభిమానులు తాజా వార్త‌ల‌తో సంతోషిస్తున్నారు.

వాస్తవానికి STR 48లో ఇంత‌కుముందు వేరే పేర్లు వినిపించాయి. కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ లేదా దీపికా పదుకొనే నటించవచ్చని క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు కియారా అద్వానీ లేదా జాన్వీ కపూర్ ల‌కు ఛాన్సుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. కానీ మేకర్స్ నుండి అధికారిక నిర్ధారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. శింబు ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న థ‌గ్ లైఫ్ లో కీల‌క పాత్ర‌ పోషిస్తున్నాడు. STR 48 షూటింగ్ జూన్ చివరిలో ప్రారంభం కానుందని సమాచారం. మేకర్స్ ఇత‌ర ప‌నుల‌ను వేగవంతం చేశారు.

Tags:    

Similar News