నారీ నారీ వాష్ రూమ్ వార్ హైలైట్
అమ్మాయి- అబ్బాయి మధ్య చిగురించే ప్రేమ, మధ్యలో ప్రవేశించే ఇతరులతో ఆకర్షణలు వెరసి నేటి జెన్ జెడ్ ప్రేమల్లో కన్ఫ్యూజన్ ని తెరపై చూపించారు.;
రెండు జంటలు.. వారి మధ్య మకతిక ప్రేమకథలతో బాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. హిందీ చిత్రసీమ స్ఫూర్తితో తెలుగులోను కొన్ని సినిమాలు తెరకెక్కించి దర్శకులు ఘన విజయం సాధించారు. అమ్మాయి అబ్బాయి, ఆ మధ్యలో ప్రవేశించే మరో అమ్మాయి లేదా అబ్బాయి కథల్లో ఎప్పుడూ రొమాన్స్, కామెడీ హైలైట్ గా నిలుస్తాయి. అలాంటి కథతోనే వచ్చింది `సన్నీ సంస్కారికి తులసి కుమారి`. ఈ చిత్రంలో యువతరం కథానాయకుడు వరుణ్ ధావన్ - జాన్వీ- సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్.. వీళ్ల మధ్యలో ప్రేమకథలు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా కానీ, కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం అప్పటికే చూసేసిన ఫార్ములాతో సినిమాని నడిపించడంతో ఇది అంతంత మాత్రంగానే ఆడుతోంది. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ - సన్యా మల్హోత్ర ఒకరితో ఒకరు పోటీపడి నటించిన బాత్రూమ్ సీక్వెన్స్ సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. ఒకరినొకరు డామినేట్ చేసేందుకు పోటీపడే భామలుగా ఇద్దరి నటనా ఆకట్టుకుంది.. ఇలాంటి లైటర్ వెయిన్ ఎలిమెంట్స్ సినిమాకి ప్లస్ అయినా కానీ ఇప్పుడున్న యువతరం ఇంకా ఏదో కావాలని కోరుకుంటారు. కానీ దానిని ఇవ్వడంలో దర్శకుడు సఫలం కాలేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అమ్మాయి- అబ్బాయి మధ్య చిగురించే ప్రేమ, మధ్యలో ప్రవేశించే ఇతరులతో ఆకర్షణలు వెరసి నేటి జెన్ జెడ్ ప్రేమల్లో కన్ఫ్యూజన్ ని తెరపై చూపించారు. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ల నేచురల్ పెర్ఫామెన్స్ ప్రధాన ఆకర్షణ? ఇదొక టైమ్ పాస్ మూవీ. జాన్వీ ఇటీవలి కాలంలో ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూనే, ఇలాంటి రొమాంటిక్ కామెడీల్లోను నటిస్తోంది. మునుముందు తెలుగులో `పెద్ది` సినిమాతో అలరించనుంది. వరుణ్ ధావన్ భేధియా 2 లాంటి వైవిధ్యమైన చిత్రం చేస్తూనే, ఇప్పుడు రొమాంటిక్ కామెడీలను వదిలి పెట్టడం లేదు.