'చెన్నై ఎక్స్‌ప్రెస్'తో పోలికే లేదు: పరమ్ సుందరి
అయితే దీనికి జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. నిజానికి చెన్నై ఎక్స్ ప్రెస్ తో మా సినిమాకి ఎలాంటి పోలికా లేదు.;
క్రాస్ కల్చర్ నేపథ్యంలో రెండు భిన్న ప్రాంతాలకు చెందిన యువతీ యువకుల ప్రేమకథను తెరకెక్కిస్తే, కచ్ఛితంగా మునుపటి సినిమాలను ప్రజలు గుర్తు చేసుకోవడం సహజం. ఇప్పుడు జాన్వీకపూర్ పరమ్ సుందరి ని గతంలో విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్, టూ స్టేట్స్ చిత్రాలతో పోల్చడం చర్చగా మారింది. పరమ్ సుందరి ట్రైలర్ విడుదల కాగానే క్రాస్ కల్చర్ లవ్ స్టోరీని షారూఖ్ - దీపిక జంట నటించిన `చెన్నై ఎక్స్‌ప్రెస్`తో పోల్చారు.
అయితే దీనికి జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. నిజానికి చెన్నై ఎక్స్ ప్రెస్ తో మా సినిమాకి ఎలాంటి పోలికా లేదు. అయినా ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో మా సినిమాను పోల్చడం గొప్ప విషయం అనుకుంటున్నాను. అయినా మా రెండు సినిమాల కథలకు పోలిక ఉండదు.. అని తెలిపింది. అలాగే చెన్నై ఎక్స్ ప్రెస్ లో దీపిక పదుకొనే తమిళమ్మాయిగా నటించింది. నేను ఈ చిత్రంలో సగం తమిళమ్మాయి, సగం కేరళ అమ్మాయిగా కనిపిస్తాను! అని జాన్వీ చెప్పుకొచ్చింది. రెండు భిన్న సంస్కృతుల సమ్మేళనంలో ప్రేమకథలో ఎలాంటి గడబిడ జరిగింది? అన్నది తెరపైనే చూడాలి.
ఆగస్టు 29న 'పరమ్ సుందరి' విడుదలవుతోంది. ఆరోజు చెన్నై ఎక్స్ ప్రెస్ తో పోలిక ఏమిటన్నది తెలుస్తుంది.. వెయిట్ చేయండి! అంటూ జాన్వీ తన నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైనవని పేర్కొంది. చెన్నై ఎక్స్ ప్రెస్ 10 సంవత్సరాల క్రితం విడుదలైంది. దీంతో మా సినిమాకి పోలిక లేదు. ఇవి రెండూ ఒకేలా ఉండవు! అని జాన్వీ వివరణ ఇచ్చింది.
ఇంతకుముందు క్రాస్ కల్చర్ నేపథ్యంలోని `2 స్టేట్స్` చిత్రం `చెన్నై ఎక్స్‌ప్రెస్` తర్వాత వచ్చింది. అప్పుడు కూడా ఆ రెండిటి నడుమా కొంత పోలిక చూసారు. ఈ రకమైన సినిమాలు ప్రతి సంవత్సరం విడుదల కావడం లేదు. ఆసక్తికరంగా జనం మనల్ని మరచిపోవాల్సిన దానితో పోల్చడం లేదు. చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి అద్భుతమైన చిత్రంతో పోల్చారు. ఇందులో గొప్ప స్టార్లు నటించారు. దానితో పోలిక ఉత్సాహం పెంచుతోందని జాన్వీ అన్నారు.