జాన్వీ పెళ్లి సింపుల్‌గా, హనీమూన్ మాత్రం లాంగ్..!
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.;
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇప్పటికే ఈ అమ్మడు చేసిన సినిమాలు కమర్షియల్ సక్సెస్‌గా నిలువలేక పోయాయి. అయినా తన అందమైన ఫోటోలు, వీడియోల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఆకట్టుకుంటూ ఉంది. జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ అవుతూ వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈమె ఏం చేసినా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ రెగ్యులర్‌గా తిరుపతిలో కనిపిస్తూ ఉంటుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఇష్టం అని, ప్రత్యేక రోజుల్లో, ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే తప్పకుండా జాన్వీ కపూర్ స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లో ఆ సమయంలో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.
పెళ్లిపై జాన్వీ కపూర్ కామెంట్స్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తన పెళ్లి, హనీ మూన్ గురించి కూడా స్పందించింది. గతంలో చాలా సార్లు జాన్వీ కపూర్ తన పెళ్లి తిరుపతిలో జరుగుతుందని చెప్పింది. ఇప్పుడు కూడా అదే మాట మీద నిలిచింది. తిరుపతిలో తాను పెళ్లి చేసుకుంటాను అంది. అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో తన పెళ్లి తిరుపతిలో జరగాలని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నాను. అదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంది. తిరుపతిలో వివాహం చేసుకోవడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పిన జాన్వీ కపూర్ హనీమూన్ విషయంలో మాత్రం చాలా ప్లాన్‌లు చేస్తున్నట్లు పేర్కొంది. హనీమూన్ ను సింపుల్‌గా కాకుండా కాస్త గ్రాండ్‌గానే ఈమె ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లాంగ్ హనీమూన్ కోసం తాను వెయిట్ చేస్తున్నట్లు ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
లాంగ్ హనీమూన్ కోరుకుంటున్న జాన్వీ కపూర్
సాధారణంగా పెళ్లి గురించి ఓపెనింగ్ మాట్లాడేందుకే సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్స్ ఆసక్తి చూపించరు. కానీ జాన్వీ కపూర్ ఏకంగా తన హనీమూన్ విషయాన్ని కూడా ఇలా ఓపెన్‌గా లాంగ్ హనీమూన్ కావాలి, ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నట్లు చెప్పడం ద్వారా వార్తల్లో నిలిచింది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఒక్క సక్సెస్ అన్నట్లుగా ఎదురు చూస్తోంది. ఇటీవల పరమ్ సుందరి సినిమాతో జాన్వీ కపూర్ వచ్చింది. ఆ సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ జాన్వీ కపూర్ కి పరమ్ సుందరి ఆశించిన స్థాయిలో విజయాన్ని కట్టబెట్టలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగల్చడం తో జాన్వీ కపూర్ హిందీలో మరో సినిమాతో విజయం కోసం ఎదురు చూస్తోంది. ఎన్ని ఫ్లాప్‌లు పడ్డా జాన్వీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
రామ్ చరణ్, బుచ్చిబాబు పెద్ది సినిమాలో...
జాన్వీ కపూర్ సాధారణంగానే అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. రొమాంటిక్ సినిమాలంటే ఏ స్థాయిలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరమ్ సుందరి సినిమాలోని రెయిన్ సాంగ్‌లో చీర కట్టి జాన్వీ కపూర్ కన్నుల విందు చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత అందంగా ఏ హీరోయిన్ రెయిన్ డాన్స్ లో కనిపించలేదని, రెయిన్ డాన్స్ తో, అందాల ఆరబోతతో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది అంటూ జాన్వీ కపూర్ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. దేవర తర్వాత పెద్ది సినిమాతో జాన్వీ కపూర్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే నమ్మకం ను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.