అందుకే ముగ్గురు పిల్లల్ని కంటాను.. వామ్మో జాన్వీ పెద్ద ప్లానే వేసిందిగా!

మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో "ఒకరైతే ముద్దు ఇద్దరైతే హద్దు" అనే నినాదం ఎప్పటినుంచో నడుస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-30 16:57 GMT

మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో "ఒకరైతే ముద్దు ఇద్దరైతే హద్దు" అనే నినాదం ఎప్పటినుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. కానీ చాలామంది ఇద్దరికి మించిన పిల్లలకు జన్మనిస్తూ ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా దేశ జనాభాను అదుపు చేయడానికి ఇలాంటి పద్ధతులను అమలులోకి తీసుకొచ్చినా ఎవరు సరిగ్గా పాటించడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అందరిలాగే తనకు కూడా ముగ్గురు పిల్లలు కావాలని అంటోంది బాలీవుడ్ బ్యూటీ.

అందుకే ముగ్గురు పిల్లలకు జన్మనిస్తాను - జాన్వీ కపూర్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఏకంగా తనకు ముగ్గురు పిల్లలు కావాలంటూనే.. అందుకు తగిన సమాధానం కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా జాన్వీ కపూర్ నటించిన చిత్రం పరమ్ సుందరి. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె పిల్లల్ని కనడం గురించి మాట్లాడుతూ.." నా లక్కీ నంబర్ మూడు. పెళ్లి తర్వాత ముగ్గురికి జన్మనిస్తా.. వారిలో ఇద్దరు గొడవపడుతున్నప్పుడు మూడో బిడ్డ ఎవరికి సపోర్ట్ చేస్తారో నేను చూడాలి. సందర్భాన్ని బట్టి వాళ్ళ మద్దతు మారుతూ ఉంటుంది . ఇలా నా బిడ్డలందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు" అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ ప్లాన్ బాగుంది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది జనాభా లెక్కలు పెంచేలా ఉందే అంటూ కూడా సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

బాలీవుడ్ తో పాటు సౌత్ లో వరుస సినిమాలు చేస్తున్న జాన్వీ..

జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె దివంగత నటీమని శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరియర్ మొదట్లో పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా మారిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి సత్తా చాటింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న జాన్వీ కపూర్.. తెలుగులో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'దేవర' సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది జాన్వీ కపూర్. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న బుచ్చి బాబు సనా దర్శకత్వంలో.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ' పెద్ది' సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా.. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదలకు సిద్ధం కాబోతోంది.

జాన్వీ కపూర్ పరమ్ సుందరి సినిమా విశేషాలు..

తుషార్ జలోట దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పరమ్ సుందరి'. మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సంజయ్ కపూర్, సిద్ధార్థ్ శంకర్ , మనోజ్ సింగ్, వినాయక శర్మ, అభిషేక్ బెనర్జీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తోంది. అందులో జాన్వి కపూర్ అటు హీరోయిన్ గా ఇటు ఐటమ్ సాంగ్ లో కూడా నటించి అబ్బురపరిచింది.

Tags:    

Similar News