చరణ్ తో సాంగ్.. శ్రుతిని జాన్వీ బీట్ చేసిందా?

దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా వచ్చిన మూడో సింగిల్ హల్లల్లల్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

Update: 2026-05-25 10:57 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ.. అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా వచ్చిన మూడో సింగిల్ హల్లల్లల్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

ఆ పాటలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. కొందరు నెటిజన్లు అయితే పాటలో జాన్వీ, శృతి హాసన్ ను కూడా బీట్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. నిజానికి భోపాల్‌ లో నిర్వహించిన పెద్ది కీ ఆవాజ్ ఈవెంట్‌ లో పాటను విడుదల చేశారు.

అక్కడ అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ కూడా ఫుల్ జోష్‌ లో కనిపించింది. విడుదలైన కొద్ది గంటల్లోనే పాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ సాధిస్తోంది. ఆ పాటకు ఏఆర్ రెహమాన్ అందించిన ట్యూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ డ్రమ్స్, ఫోక్ బీట్స్, మాస్ రిథమ్ కలగలిసి ఆ పాటను పూర్తి స్థాయి మాస్ యాంథమ్‌ గా మార్చేశాయి.

అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం కూడా పాటకు బాగా కలిసొచ్చింది. విలేజ్ నేటివిటీతో కూడిన పదాలు ప్రేక్షకులను వెంటనే కనెక్ట్ చేస్తున్నాయి. రక్షితా సురేష్ పవర్‌ ఫుల్ వాయిస్ పాటకు మరింత ఎనర్జీ తీసుకొచ్చింది. అయితే పాటలో ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తున్న అంశం మాత్రం జాన్వీ కపూర్ గ్లామర్, డ్యాన్స్ మూవ్స్. ప్రత్యేకంగా ఆమె ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులు, స్క్రీన్‌ పై కనిపించిన కాన్ఫిడెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

కొన్ని షాట్లలో ఆమె ప్రెజెన్స్ చాలా హైలైట్ అవ్వడంతో సోషల్ మీడియాలో జాన్వీ షో స్టీల్ చేసిందనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇమేజ్‌ తో వచ్చిన జాన్వీ, ఆ పాటలో మాత్రం పూర్తి స్థాయి సౌత్ మాస్ స్టైల్‌ లో కనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక శృతి హాసన్ కూడా తన గ్లామర్, గ్రేస్‌తో ఆకట్టుకుంది. అయితే జాన్వీ ఎనర్జీ, స్క్రీన్ స్పేస్ ఎక్కువగా హైలైట్ కావడంతో ఇద్దరి మధ్య కంపేరిజన్స్ మొదలయ్యాయి.

కొందరు నెటిజన్లు శృతి స్టైలిష్‌ గా కనిపించిందని, కానీ జాన్వీ మాస్ అప్పీల్‌ తో అదరగొట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చరణ్‌ తో జాన్వీ వేసిన స్టెప్పులు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి. విజువల్‌ గా కూడా హల్లల్లల్లో పాట రిచ్‌ గా కనిపిస్తోంది. భారీ సెట్స్, కలర్‌ ఫుల్ లైటింగ్, గ్రాండ్ కాస్ట్యూమ్స్ పాటను మరింత ఎలివేట్ చేశాయి. ప్రతి ఫ్రేమ్‌ లో బుచ్చిబాబు ప్లానింగ్ కనిపిస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది.

అయితే మాస్ కథల్లో స్పెషల్ సాంగ్స్ ఎంత కీలకమో బాగా తెలిసిన ఆయన, పాటను కూడా థియేటర్లలో విజిల్స్ పడేలా డిజైన్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి హల్లల్లల్లో సాంగ్ తో పెద్దిపై హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా జాన్వీ కపూర్‌ కు ఇది సౌత్‌ లో మాస్ ఇమేజ్ తీసుకొచ్చే పాటగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 4న సినిమా విడుదల కానుండగా, థియేటర్లలో సాంగ్ కు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News