జాన్వి అక్కడ బిజీ అవ్వాలని చూస్తుందా..?
ప్రస్తుతం అమ్మడు పెద్ది సినిమాతో పాటు రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తుంది.;
శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ బాలీవుడ్ లో తన మార్క్ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. హిందీలోనే కాదు తన మదర్ లానే సౌత్ సినిమాల్లో కూడా రాణించాలని అనుకున్న జాన్వి కపూర్ ఎన్ టీ ఆర్ దేవర తో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమాలో తంగం పాత్రలో జాన్వి కపూర్ ఆకట్టుకుంది. సినిమాలో అమ్మడి గ్లామర్ కి తెలుగు ఆడియన్స్ పడిపోయారని చెప్పొచ్చు. ఐతే జాన్వి కపూర్ దేవర తర్వాత దేవర 2 చేయాల్సి ఉంది.
ఐతే ఈలోగా రాం చరణ్ పెద్ది ఆఫర్ అందుకుంది. బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ లీడ్ రోల్ లో చేస్తున్న పెద్ది సినిమా సంథింగ్ స్పెషల్ గా రానుంది. ఈ సినిమా విషయంలో జాన్వి కపూర్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉంది. ఐతే దేవర సినిమా చేసినా కూడా జాన్వికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆ సినిమాలో ఆమెను కేవలం గ్లామర్ షోకి మాత్రమే అన్నట్టుగా చూపించారు. ఐతే పెద్ది విషయంలో అలాంటి తప్పు జరగకూడదని ఫిక్స్ అయ్యింది. అందుకే అమ్మడు ఈ పాత్రని ఎంపిక చేసుకుంది.
ఇదిలా ఉంటే సౌత్ సినిమాల మీద ఫోకస్ తో అక్కడ బాలీవుడ్ లో అవకాశాలు మిస్ అవుతున్నాయని భావిస్తున్న జాన్వి కపూర్ ఇక మీదట అక్కడే ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యిందట. ఎంత చేసినా సౌత్ లో గ్లామర్ కన్నా యాక్టింగ్ తోనే ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐతే అలాంటి పాత్రలు పడితేనే కానీ జాన్వికి ఇక్కడ సూపర్ స్టార్ డం వచ్చే అవకాశం ఉండదు. అందుకే సౌత్ సినిమాలు అడపాదడపా చేసినా తనకు అనుకువగా ఉండే హిందీ సినిమాలే చేస్తే బెటర్ అని భావిస్తుందట జాన్వి కపూర్.
ప్రస్తుతం అమ్మడు పెద్ది సినిమాతో పాటు రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి పరం సుందరి కాగా మరొకటి సన్నీ సంస్కారి కి తులసి కుమారి సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో మరోసారి బాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తుంది జాన్వి కపూర్. ఐతే తెలుగులో మాత్రం పెద్ది హంగామా బాగుండగా ఆ సినిమా సక్సెస్ ఐతే మళ్లీ తెలుగు ఇంకా సౌత్ పరిశ్రమల నుంచి జాన్వి కపూర్ కి ఛాన్స్ లు వచ్చే వీలుంటుంది.