జాన్వీ కపూర్‌.. సొంత గడ్డపై ఇప్పటికైనా క్లిక్కయ్యేనా?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్లకు వారసత్వంగా వచ్చే హంగామా హై లెవెల్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-26 20:30 GMT

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్లకు వారసత్వంగా వచ్చే హంగామా హై లెవెల్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కి కూడా అదే వరమైంది. తక్కువ కాలంలోనే బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్‌లో దేవర సినిమాతో అడుగుపెట్టిన జాన్వీ కమర్షియల్ గా మంచి హిట్టయితే కొట్టింది. ఇక పెద్ది ఆమెకు మరో గోల్డెన్ ఛాన్స్. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అమ్మడు రెండు ఇండస్ట్రీల్లోనూ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్‌గా నిలిచింది.

అయితే స్టార్ ఇమేజ్ ఉన్నా, జాన్వీ కెరీర్‌లో మాత్రం మచ్చలేదని చెప్పలేం. ఇప్పటివరకు చేసిన హిందీ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దారుణంగా విఫలమయ్యాయి. స్టార్ హీరోయిన్‌ క్రేజ్‌ ఉన్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఆమె కెరీర్‌కి ఒక బలమైన విజయమే ఇప్పుడు అత్యవసరం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం బాలీవుడ్‌లో విడుదల కానున్న పరమ్ సుందరి సినిమాపైనే ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్‌, పాటలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాతో జాన్వీ ఎట్టకేలకు హిందీ ఆడియన్స్‌ని బిగ్ స్క్రీన్‌లో ఆకట్టుకుంటుందనే నమ్మకం పెరిగింది.

గత రెండేళ్లలో జాన్వీ నటించిన సినిమాలు గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్, హోంబౌండ్ లాంటి చిత్రాలు ప్రేక్షకులను అసలు మెప్పించలేకపోయాయి. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గానే మిగిలిపోయాయి. ఆ డిజాస్టర్స్ తర్వాత పరమ్ సుందరి జాన్వీకి ఒక కమ్‌బ్యాక్ అవకాశంగా మారింది. టాలీవుడ్‌లో మాత్రం జాన్వీ క్రేజ్ వేరే రేంజ్‌లో ఉంది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించగా, ప్రస్తుతం రామ్ చరణ్‌తో పెద్ది సినిమాతో బిజీగా ఉంది.

ఈ రెండు సినిమాలే ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలబడటానికి బలమైన బేస్‌గా మారాయి. బాలీవుడ్‌లో కూడా పరమ్ సుందరి హిట్ అయితే, జాన్వీ రెండు ఇండస్ట్రీల్లోనూ తన స్థాయిని పెంచుకునే అవకాశం ఉంది. ఇక మొత్తంగా చెప్పాలంటే, జాన్వీ కపూర్‌కు పరమ్ సుందరి సినిమా నిజమైన పరీక్ష. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడితే, హిందీలో మళ్లీ బలమైన స్థానం సంపాదించడమే కాకుండా, పాన్ ఇండియా హీరోయిన్‌గా కెరీర్‌కి కొత్త ఊపు వస్తుంది. మరి ఆ సినిమా కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News