ఉమేష్ బిస్త్‌తో జూలు విదిల్చిన జాన్వీ కపూర్!

`పగ్లైట్` వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రానికి దర్శకత్వం వహించిన ఉమేష్ బిస్త్‌తో జాన్వీ కపూర్ చేతులు కలిపారు.

Update: 2026-07-18 14:22 GMT

ఇటీవల విడుదలైన `పెద్ది` చిత్రం వివాదాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాలో జాన్వీ క‌పూర్ పాత్రను చిత్రీకరించిన తీరుపై.. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్ , కొన్ని సన్నివేశాల విషయంలో జాన్వీ కపూర్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చిత్రంలో అచ్చియమ్మ పాత్రను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారనే ఆరోపణలు రావడంతో? చిత్రబృందం దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వచ్చింది. ఈ ప్రతికూల వాతావరణం నుండి బయటపడిన జాన్వీ కెరీర్‌లో తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

`పగ్లైట్` వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రానికి దర్శకత్వం వహించిన ఉమేష్ బిస్త్‌తో జాన్వీ కపూర్ చేతులు కలిపారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌లేదు. అయితే ఇది ఒక ప్రత్యేకమైన కథాంశంతో వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు బాలాజీ మోషన్ పిక్చర్స్ - సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఉమేష్ బిస్త్ `పగ్లైట్` సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నా? జాన్వీతో చేయబోయే ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా రు. ఆయన కథల్లో ఉండే భావోద్వేగాల లోతును దృష్టిలో ఉంచుకుని జాన్వీ ఈ చిత్రానికి బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్ని స్తుంది. ఓ ర‌కంగా తన నటనను నిరూపించుకునే మరో అవకాశం గొప్ప అవ‌కాశమ‌ని ఆమె అభిమానులు

చెప్పుకొస్తున్నారు. `పెద్ది`లో ఎదురైన విమర్శలను పాఠంగా తీసుకుని కొత్త సినిమాలో అమ్మ‌డు మరింత జాగ్రత్తగా పాత్రలను ఎంచుకోవాల‌ని సూచిస్తున్నారు. మ‌రి ఈ కొత్త చిత్రం ద్వారా జాన్వీ కపూర్ మళ్ళీ తనపై వస్తున్న ఆరోపణలను చెరిపేసుకునే అవకాశం ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. కథ, నటనకు ప్రాధాన్యత ఇచ్చే ఉమేష్ బిస్త్ లాంటి దర్శకుడితో పని చేయడం జాన్వీ కెరీర్‌కు ఖచ్చితంగా పాజిటివ్ మార్పును తీసుకురావచ్చు.

జాన్వీ కపూర్ కెరీర్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రాజెక్ట్ కీలక మలుపుగా మారనుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఉమేష్ బిస్త్ లాంటి దర్శకుల మార్గదర్శకత్వంలో తనలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరిం చేందుకు ఉత్సాహంగా ఉంది. క్లిష్టమైన పాత్రలను సున్నితమైన భావోద్వేగాలతో తెరపైకి తీసుకురావడంలో బిస్త్ సిద్ధహస్తుడు కాబట్టి ఈ చిత్రం జాన్వీ నటనా ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మునుపటి చిత్రాల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాల వైపు జాన్వీ మొగ్గు చూపడం శుభపరిణామం. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాకుండా? విమర్శకుల నోళ్లు మూయించడమే లక్ష్యంగా జాన్వీ కొత్త పాత్ర కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తోంది. కష్టతరమైన పాత్రలను ఎంచుకోవడం ద్వారా తనపై ఉన్న గ్లామర్ డాల్ ముద్రను చెరిపేసుకుని పరిణితి చెందిన నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే జాన్వీ ఆకాంక్ష ఈ చిత్రంతో నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News