వినోద రంగంలో మారుతున్న సెన్సార్ నిబంధనలు!

సినిమా - ఓటిటి కంటెంట్ విషయంలో సెన్సార్‌షిప్, అభ్యంతరాలు , న్యాయపరమైన వివాదాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి.

Update: 2026-07-18 14:30 GMT

సినిమా - ఓటిటి కంటెంట్ విషయంలో సెన్సార్‌షిప్, అభ్యంతరాలు , న్యాయపరమైన వివాదాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఇటీవల కాలంలో కొన్ని వెబ్ సిరీస్‌లు .. చిత్రాల ప్రసారంపై ఆంక్షలు విధించడం క‌నిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కళాకారుడు తన సృజనాత్మకతకు ఆటంకం కలిగినప్పుడు ఏ మార్గంలో వెళ్లాలి? నిరసన తెలపాలా? లేక చట్టాన్ని ఆశ్రయించాలా ? అనే కోణంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక వివాదం తలెత్తినప్పుడు లేదా కంటెంట్‌ను నిలిపివేయాలని డిమాండ్ వచ్చినప్పుడు కళాకారులు బహిరంగంగా అసహనాన్ని వ్యక్తం చేయడం ..సోషల్ మీడియా వేదికగా వాదించడం చూస్తుంటాం.

అయితే ఇలాంటి ఆవేదన కంటే న్యాయపరమైన మార్గాలే మేలని సీనియర్ నటులు అభిప్రాయపడుతున్నారు. భావోద్వేగపూరితమైన విమర్శల కంటే న్యాయస్థానాల ద్వారా వాదనను బలంగా వినిపించడం ద్వారానే నిజమైన పరిష్కారం దొరుకుతుంద‌ని సూచిస్తున్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒకవేళ ఏవైనా అభ్యంతరాల వల్ల కంటెంట్ నిలిపిస్తే? దానికి వ్యతిరేకంగా పోరాడటానికి చట్టపరమైన వేదికలు అందుబాటులో ఉన్నప్పుడు నిరాశకు గురికావడం వల్ల ప్రయోజనం ఉండదు. స్వేచ్ఛా ప్రసారం కోసం .. తమ సృజనాత్మక హక్కుల పరిరక్షణ కోసం కోర్టు మెట్లు ఎక్కడం అనేది పరిణతి చెందిన ప్రవర్తనగా పరిగణించబడుతుంది.

సమాజంలో వివిధ వర్గాల నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని కేవలం రాజకీయ కోణంలోనో .. బాధితుడిగానో చూడటం కంటే చట్టబద్ధమైన తర్కంతో ఎదుర్కోవడమే సరైన మార్గం. నటుడు ..దర్శకుడు తమ చిత్రానికి మద్దతుగా గొంతు పెంచడం తప్పు కాదు. కానీ ఆ గొంతును న్యాయస్థానాల్లో వినిపిస్తే దానికి మరింత బలం చేకూరుతుంది. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా స్పష్టమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కళా స్వేచ్ఛ, ప్రజా ఆకాంక్షల మధ్య సమతుల్యత పాటించడం ఓటిటి సంస్థలకు .. చిత్ర నిర్మాతలకు సవాలుగా మారింది. ఏదేమైనా? వివాదాలు తలెత్తినప్పుడు ఎమోషనల్ అప్పీల్స్ కంటే రాజ్యాంగపరమైన హక్కుల కోసం పోరాడటం వల్ల కళాకారుడికి, పరిశ్రమకు గౌరవం పెరుగుతుంది.

చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విశ్వాసంతో ముందుకు సాగడమే ఇక్కడ ముఖ్యం.ఎటువంటి వివాదాలు వచ్చినా ? సృజనాత్మక స్వేచ్ఛకు అడ్డంకులు ఎదురైనా? నిరాశ చెందకుండా .. విమర్శలకు వెరవకుండా చట్టబద్ధమైన మార్గాల ద్వారా అభిప్రాయాలను నిరూపించుకోవడం ఉత్తమమైన పద్ధతి. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి సమస్యకు పరిష్కారం న్యాయ వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి కళాకారులు ఆ మార్గాన్నే ప్రధానంగా ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News