సూప‌ర్ స్టార్ రూమ్ లో 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ!

సినిమా రంగంలో నటుడు ఎదగడానికి కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు. అదృష్టం .. సరైన గురువుల సాన్నిధ్యం కూడా తోడవ్వాలి.

Update: 2026-07-18 13:30 GMT

సినిమా రంగంలో నటుడు ఎదగడానికి కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు. అదృష్టం .. సరైన గురువుల సాన్నిధ్యం కూడా తోడవ్వాలి. తాజాగా కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పంచుకున్న జ్ఞాపకాలు సినీ చరిత్రలోని ఆసక్తికరమైన కోణాన్ని ఆవిష్కరించాయి. ప్రముఖ పద్మాలయా స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ గారి మేకప్ రూమ్‌లో తాను ఏడాది పాటు ఉన్నాననే విషయం ఆయన పట్ల కృష్ణ గారు చూపిన ఆదరణను తెలియజేస్తోంది. అప్పట్లో ఓ కొత్త నటుడికి మేటి నటుడి మేకప్ గదిలో చోటు దక్కడం అంటే అది చిన్న విషయం కాదు.

కృష్ణ కేవలం నటుడిగానే కాకుండా? ఎందరో కొత్త వారికి ఆశ్రయం కల్పించే పెద్ద మనసున్న వ్యక్తిగా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. ఆ మేకప్ రూమ్‌లో గడిపిన కాలం తన నటనను సినీ ప్రపంచాన్ని అర్థం చేసుకునే కోణాన్ని పూర్తిగా మార్చేసింద‌ని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. సూపర్ స్టార్ స్థాయి వ్యక్తి దగ్గర ఉండటం వల్ల క్రమశిక్షణ, సమయపాలన పని పట్ల ఉండాల్సిన అంకితభావం పృథ్వీరాజ్‌కు ఆ కాలంలోనే అలవడ్డాయి. కెమెరా ముందు నటన ఎంత ముఖ్యమో? సెట్స్‌లో ఉన్నప్పుడు తోటి కళాకారులను, సాంకేతిక నిపుణులను ఎలా గౌరవించాలో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలు ఆయన ప్రయాణంలో ఎంతో సహాయపడ్డాయి. ఆ గది కేవలం మేకప్ కోసం మాత్రమే కాదు. ఒక నటుడు ఎలా ఉండాలో నేర్పే శిక్షణాలయంలా నిలిచింది.

కెరీర్ ప్రారంభ రోజుల్లో ఆర్థికంగా, మానసికంగా ఎంతో మంది నటులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ తన సొంత మేకప్ రూమ్‌లోనే ఉండనివ్వడం పృథ్వీరాజ్ వంటి నటులకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఆ రోజుల్లో అక్కడ జరిగిన చర్చలు, కృష్ణ గారు షాట్ గ్యాప్‌లో చెప్పే విషయాలు ఆయనలోని నటుడికి దిశానిర్దేశం చేశాయి. ఒక నటుడు సహచరులకు, జూనియర్లకు ఏ విధంగా మార్గదర్శకం కావాలో కృష్ణ ఆచరణలో చూపిస్తే పృథ్వీరాజ్ ఆ ఆత్మీయతను తన కెరీర్ మొత్తం గుర్తుంచుకున్నారు.

ఈ సుదీర్ఘ అనుబంధమే పృథ్వీరాజ్ తరువాత రోజుల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే గుర్తింపును తెచ్చుకోవడానికి పునాది వేసింది. పద్మాలయా స్టూడియో గోడలు ఎన్నో గొప్ప చారిత్రక విజయాలకు సాక్షి మాత్రమే కాదు. ఇలాంటి ఎంతో మంది కళాకారుల ఎదుగుదలకు నిలయాలుగా నిలిచాయి. సినీ పరిశ్రమలో బంధాలు ఎంతటి గాఢమైనవో పృథ్వీరాజ్ పంచుకున్న జ్ఞాపకాలు చాటి చెబుతున్నాయి. ఏ రంగంలోనైనా పాత తరం అందించిన ప్రోత్సాహం, నూతన తరం కళాకారులను ఎలా తయారు చేస్తుందో? చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

కృష్ణ వంటి మహానుభావుల నీడలో ఎదిగిన పృథ్వీరాజ్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించడం కొనసా గిస్తూనే ఉన్నారు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను గుర్తింపును ద‌క్కించుకున్నారు. సాధార‌ణంగా కామెడీ న‌టుల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉంటుంది. అలాంటి పోటీని సైఔతం పృథ్వీరాజ్ త‌ట్టుకుని నిల‌బడ్డాడు. అత‌డు స‌క్సెస్ అవ్వ‌డానికి సంవ‌త్స‌రాలు స‌మ‌యం ప‌ట్టినా? వ‌చ్చిన గుర్తింపు ఆ క‌ష్టానంతా మ‌ర్చిపోయి నిరంత‌రం తానో కొత్త న‌టుడిగానే భావించి ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు.

Tags:    

Similar News