జాన్వీకి పెద్ది అయినా బ్రేక్ ఇస్తాడా?
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జాన్వీ దాదాపు పది సినిమాలు చేసింది. కానీ వాటిలో ఏ సినిమాతోనూ జాన్వీ నటిగా తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోలేకపోయింది.;
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో గ్లామర్ ఇండస్ట్రీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న జాన్వీ కెరీర్ స్టార్టింగ్ లో పెద్దగా హిట్లు అందుకుంది లేదు. అయినప్పటికీ జాన్వీ గ్లామర్ కారణంతో మంచి ఆఫర్లు అందుకుంటూనే వస్తుంది.
గ్లామర్ పాత్రలకే పరిమితమైన జాన్వీ
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జాన్వీ దాదాపు పది సినిమాలు చేసింది. కానీ వాటిలో ఏ సినిమాతోనూ జాన్వీ నటిగా తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఇప్పటివరకు జాన్వీ చేసిన ఏ పాత్రా ఆమెలోని టాలెంట్ ను బయటకు తీసుకొచ్చే స్కోప్ ను ఇవ్వలేదు. సౌత్ లో ఎన్టీఆర్ తో చేసిన దేవర లో కూడా జాన్వీ గ్లామర్ కే పరిమితమైంది తప్పింది నటనకు ప్రాధాన్యత లేదు.
జాన్వీ ఆశలన్నీ పెద్ది పైనే!
దీంతో యాక్టింగ్ పరంగా జాన్వీ ఆడియన్స్ లో ఎలాంటి ఆదరణ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జాన్వీ తన ఆశలన్నింటినీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న పెద్దిపై పెట్టుకుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్దిలో జాన్వీ హీరోయిన్ గా కనిపించనుండగా, రీసెంట్ గా మూవీ నుంచి రిలీజైన చికిరి సాంగ్ లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
చికిరి సాంగ్ తో ఆకట్టుకున్న జాన్వీ
అంతేకాదు, పెద్ది మూవీలో జాన్వీ కోసం బుచ్చిబాబు చాలా మంచి పాత్రను రాశారని, పెద్దిలో జాన్వీ క్యారెక్టర్ కథను ముందుకు నడిపే విధంగా ఉంటూనే, ఆ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే చికిరి సాంగ్ మిలియన్ల వ్యూస్ ను అందుకుని చార్ట్‌బస్టర్ గా నిలవగా, చరణ్ డ్యాన్స్ మూమెంట్స్, జాన్వీ గ్లామర్ సాంగ్ ను రిపీట్స్ లో చూసేలా చేస్తున్నాయి. చూస్తుంటే జాన్వీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్రేక్ పెద్ది మూవీతో దక్కేట్టుంది.