ఫోటో స్టోరి: ఫ్యాషనిస్టా సైలెంట్ పంచ్ అదిరిందిగా..!
ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అందాల కథానాయిక జాన్వీ కపూర్ తనదైన అందం ఫ్యాషన్ సెన్స్.. వైవిధ్యమైన నటనతో దూసుకుపోతున్నారు. నేటితరం కథానాయికలలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్న ఏకైక నటవారసురాలిగా జాన్వీ క్రేజ్ మామూలుగా లేదు. బాలీవుడ్‌లో పలు క్లాసిక్స్ లో తన అద్భుత నట ప్రదర్శనతో నటిగా ప్రత్యేక ప్రశంసలు అందుకుని.. `దేవర`, `పెద్ది` లాంటి అగ్ర హీరోల చిత్రాలతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టారు. ఇక భవిష్యత్తులోనూ క్రేజీ ప్రాజెక్ట్‌లతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
ఇంతలోనే `చుట్టమల్లె పాట..` వివాదం జాన్వీని ఓకింత డిస్ట్రబ్ చేసిన మాట వాస్తవం. అలాగే `పెద్ది` సినిమాకు సంబంధించి నెట్టింట కొందరు చేస్తున్న ట్రోలింగ్‌లపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి సైబర్ వేధింపులు, నెగెటివిటీని జాన్వీ కపూర్ ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడం చర్చకు వస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జాన్వీ షేర్ చేసిన తాజా ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. అయితే జాన్వీ ఈ ఫోటోషూట్ లో లిప్ స్టిక్ సహా సౌందర్య ఉత్పత్తలు బ్రాండ్ ని ప్రమోట్ చేస్తోంది. అలాగే ఈ ఫోటోగ్రాఫ్స్ లోనే ఒక ప్రత్యేకమైన ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. నెయిల్స్ చూపిస్తూ జాన్వీ తన బ్రాండ్ ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకుని వెళ్లింది. అయితే ఆ సమయంలో బో*ల్డ్‌గా మిడిల్ ఫింగర్ చూపించిన ఫోటోని కూడా జాన్వీ తాజా ఫోటోషూట్ లో షేర్ చేయడంపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. బహిరంగంగా ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికి వెళ్లని ఈ కపూర్ గాళ్ కేవలం సైబర్ వేధింపులు.. ట్రోలర్లపై తనకున్న అసంతృప్తిని చాటడానికి సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా వినూత్నంగా స్పందించారా? అనే చర్చ సాగుతోంది. ఈ ఒక్క ఫొటోతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చి ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా నిలిచారు.
జాన్వీ కపూర్ విదేశాల్లో ఇలా అంతర్జాతీయ బ్రాండ్ ప్రమోషన్స్ తో భారీగా ఆదాయం కళ్ల జూస్తున్న సంగతి తెలిసిందే. ప్రఖ్యాత నైకా, బిర్లా బ్రాండ్ సౌందర్య ఉత్పత్తులకు అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గాను జాన్వీ ఆర్జిస్తోంది. జాన్వీ ప్రస్తుతం తన తదుపరి కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ చేసారు. టాలీవుడ్ లో ఎన్టీఆర్, చరణ్ లాంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ లాంటి అగ్ర హీరోల సరసన నటించాలని కలలు కంటోంది. మరోవైపు బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన `లగ్ జా గలే` చిత్రం 2027 మే 14న విడుదల కానుండగా.. ప్రముఖ దర్శకుడు ఉమేష్ బిస్త్ దర్శకత్వంలోనూ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తదుపరి అప్ డేట్ రావాల్సి ఉంది.