తెలుగు నుంచి హాలీవుడ్ వరకు దర్శక ధీరుడి ప్రయాణం...

మొదటి అడుగులోనే సక్సెస్ అయిన రాజమౌళి 'స్టూడెంట్ నెంబర్ వన్' మూవీ తో సిల్వర్ స్క్రీన్ మీద పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు.

Update: 2026-10-10 09:45 GMT

టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. వరుసగా 12 విజయాలతో ఎవ్వరికీ సాధ్యంకానీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గ్లోబల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలతో ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడిగా పేరుపొందిన 'జేమ్స్ కామెరూన్' ప్రశంశలను అందుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు... ఈరోజు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణం పై ప్రత్యేక కథనం...

సీరియల్ నుంచి పాన్ వరల్డ్ వరకు

'శాంతినివాసం' సీరియల్ తో బుల్లితెర మీద దర్శకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. మొదటి అడుగులోనే సక్సెస్ అయిన రాజమౌళి 'స్టూడెంట్ నెంబర్ వన్' మూవీ తో సిల్వర్ స్క్రీన్ మీద పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాలు చేయడం ఆయన స్టైల్. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు సినిమాలు ఆయనను టాప్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. 'మగధీర' సినిమాతో విఎఫ్ఎక్స్ ను పూర్తి స్థాయిలో వాడి హాలీవుడి రేంజ్ లో తెలుగు సినిమాలు చేయవచ్చని నిరూపించాడు. స్టార్ హీరోలతోనే కాకుండా 'ఈగ' ను పెట్టి సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఆయన సినిమాల్లో కమర్షియల్ హంగులు ఆర్భాటాలే కాకుండా కథలో వైవిధ్యాన్ని చూపిస్తూ బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల మనసును తాకేలా సినిమా చేయడం ఆయన ప్రత్యేకత. ఒక్కప్పుడు బాలీవుడ్ చిత్రాల ముందు నిలబడటానికి ఇబ్బంది పడ్డ తెలుగు ఇండస్ట్రీ ని 'బాహుబలి' సినిమాతో ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకెళ్లాడు. రాజమౌళి వల్ల తెలుగు సినిమాకి ఇండియన్ లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది.

ప్రపంచాన్ని అబ్బురపరిచేలా వారణాసి....

ప్రస్తుతం గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ మహేష్ బాబు తో 'వారణాసి' సినిమా చేస్తున్నాడు. స్క్రీన్ మీద పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడు. అడ్వెంచర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచస్థాయి లో నిలబెడుతడనేది వాస్తవం. స్క్రీన్ మీద తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు విజువల్ గ్రాండియర్ ను నెక్స్ట్ లెవల్లో చూపించడానికి సిద్ధమవుతున్నాడు.హాలీవుడ్ డైరెక్టర్స్ కి రాజమౌళి ఈ సినిమాతో పోటీని ఇవ్వబోతున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఉన్నందుకు మనందరం గర్వపడాల్సిన సమయం ఆసన్నమైంది. అలాంటి దర్శక ధీరుడు ఈరోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఫ్యూచర్లో ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని తెలుగు సినిమా స్థాయిని రోజు రోజుకు పెంచుకుంటూ ప్రపంచం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ని నెంబర్ వన్ పొజిషన్ లో నిలపాలని కోరుకుందాం...



Tags:    

Similar News