ముద్దుగుమ్మకు మరో లైఫ్ అండ్ డెత్ మ్యాటర్..!
ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో ప్రతి సినిమా విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఫ్లాప్ వచ్చి కెరీర్ మొత్తం నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి.;
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్స్‌కి ప్రతి సినిమా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో ప్రతి సినిమా విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఫ్లాప్ వచ్చి కెరీర్ మొత్తం నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే కెరీర్ ఆరంభంలో నటీనటుల ఎంపిక సరిగ్గా లేకుంటే మొత్తం కెరీర్ ఎఫెక్ట్ కావడం మనం చూస్తూ ఉన్నాం. కెరీర్ ఆరంభంలో రెండు మూడు వరుస హిట్స్ పడితే స్టార్‌డం దక్కించుకోవడం జరుగుతుంది. అదే కెరీర్ ఆరంభంలో ఫ్లాప్స్ పడితే కెరీర్‌లో ముందుకు సాగడమే కష్టం అవుతుంది. అందుకే బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ఇండస్ట్రీలోనూ హీరోయిన్స్ కెరీర్ పరంగా నిలదొక్కుకోవాలంటే మినిమం హిట్స్ పడాల్సిందే. కానీ జాన్వీ కపూర్ లక్కీగా పెద్ద హిట్స్ పడకున్నా తన అందంతో పాటు, తన బ్యాక్ గ్రౌండ్ కారణంగా ఇండస్ట్రీలో నెగ్గుకు వస్తున్న విషయం తెల్సిందే.
జాన్వీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ
శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌కి మంచి ఆరంభం లభించింది. అయితే కమర్షియల్‌గా బిగ్ సక్సెస్‌లను దక్కించుకోవడంలో జాన్వీ కపూర్ విఫలం అయింది. అయినా కూడా సోషల్ మీడియాలో ఈమె అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు గుర్తింపు దక్కించుకుంటూ వచ్చింది. జాన్వీ కపూర్ అందంతో ఆకట్టుకోవడంతో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. ఆ మధ్య వచ్చిన పరమ్ సుందరి సినిమాతో జాన్వీ కపూర్ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. ఆమె కూడా పరమ్ సుందరి విషయంలో చాలా ఆసక్తిని పెంచుకుంది. కానీ నిరాశనే మిగిల్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈమె వరుణ్ ధావన్‌తో కలిసి 'సన్నీ సంస్కారికి తులసి కుమారి' సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే.
సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ
ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయని నమ్మకంగా ఉన్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో వరుణ్ ధావన్ తో కలిసి చేసిన రొమాన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ధర్మ నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో విభిన్నమైన ప్రేమ కథలు ఉండబోతున్నాయట. బ్రేకప్ లవ్ స్టోరీలతో పాటు, కొత్త ప్రేమలు ఎలా పుడుతాయి, ఆ సమయంలో భావోద్వేగాలు ఎలా ఉంటాయి అనేది సరదాగా చూపించే ప్రయత్నాన్ని దర్శకుడు చేశాడని మేకర్స్ చెబుతున్నారు.
రామ్ చరణ్ పెద్ది మూవీలో జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఇప్పటికే చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వచ్చాయి. పరమ్ సుందరి మాదిరిగా ఈ సినిమా సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిస్తే జాన్వీ కపూర్ కి హిందీలో ఆఫర్లు తగ్గే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి ఈ సినిమా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అన్నట్లుగా మారింది. కేవలం జాన్వీ కపూర్‌కి మాత్రమే కాకుండా వరుణ్ ధావన్ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆయన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అందుకే ఈ సినిమా విషయమై ఆయన ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరికీ ఈ సినిమా ఎంత ముఖ్యమో అనేది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు నటనలో ప్రతిభ ఉన్న జాన్వీ కపూర్‌కి ఈ సినిమా, రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది సినిమా హిట్‌ను అందిస్తాయా అనేది చూడాలి.