లగ్జరీకి కొత్త డెఫినిషన్… జాన్వీ కపూర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంత అంటే?

అయితే ఈ ఫంక్షన్‌లో ఆమె వేసుకున్న డ్రెస్ కంటే, ఆమె చేతికి పెట్టుకున్న ఒక అల్ట్రా లగ్జరీ వాచ్ అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. ఏకంగా రూ.2.5 కోట్ల విలువైన ఆ డైమండ్ వాచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం...

Update: 2026-07-08 17:24 GMT

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎక్కడ ఉన్నా తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. తాజాగా తన సోదరి అన్షులా కపూర్ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న జాన్వీ, ఒక అదిరిపోయే పింక్ కలర్ గౌన్‌లో దేవకన్యలా మెరిసిపోయింది. అయితే ఈ ఫంక్షన్‌లో ఆమె వేసుకున్న డ్రెస్ కంటే, ఆమె చేతికి పెట్టుకున్న ఒక అల్ట్రా లగ్జరీ వాచ్ అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. ఏకంగా రూ.2.5 కోట్ల విలువైన ఆ డైమండ్ వాచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం...

చేతి గడియారం ధర రూ.2.5 కోట్ల:

అన్షులా కపూర్ పెళ్లి వేడుకల్లో అందరూ సెలబ్రిటీల డ్రెస్సుల గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ జాన్వీ కపూర్ ధరించిన యాక్సెసరీస్ గురించి చర్చించుకుంటున్నారు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ 'పాటెక్ ఫిలిప్' కు చెందిన రోజ్ గోల్డ్ 'గోండోలో హాట్ క్లేర్ పెర్ల్' వాచ్‌ను జాన్వీ ఈ ఈవెంట్‌లో పెట్టుకుంది. ఇక ప్రస్తుతం మార్కెట్‌లో ఈ లగ్జరీ టైమ్‌పీస్ ధర సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని అంచనా. ఈ వాచ్ ధర విన్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

251 వజ్రాలు.. 79 అకోయా ముత్యాల మ్యాజిక్:

ఈ వాచ్ అంత ఖరీదు ఉండటానికి కారణం అందులో వాడిన అరుదైన వజ్రాలు, ముత్యాలే. దీని డయల్ భాగంలో ఏకంగా 251 మెరిసిపోయే వజ్రాలను అమర్చారు. అలాగే దీని స్ట్రాప్ పై 79 అత్యంత ఖరీదైన 'అకోయా ముత్యాలు', ప్రిన్సెస్-కట్ డైమండ్స్‌తో ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. దీని 18 క్యారెట్ల గోల్డ్ డయల్ ప్లేట్ కూడా వజ్రాల పొదుగుతో మెరిసిపోతూ రాయల్ లుక్‌ను ఇస్తోంది.

బ్లష్ పింక్ గౌన్‌లో మోడ్రన్ శారీ లుక్:

ఈ లగ్జరీ వాచ్‌కి మ్యాచ్ అయ్యేలా జాన్వీ ఒక వన్ షోల్డర్ బ్లష్ పింక్ కలర్ గౌన్‌ను ఎంచుకుంది. ఈ డ్రెస్‌పై మింట్ గ్రీన్, పౌడర్ బ్లూ, పీచ్ కలర్స్‌తో చేసిన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంతో అందంగా ఉంది. ఒక భుజం నుండి కిందకు జారేలా ఉన్న ఫ్యాబ్రిక్ డ్రేప్, దానికి ఉన్న ఫ్రింజ్ టాసెల్స్ ఈ మోడ్రన్ గౌన్‌కు ఒక శారీ లుక్‌ను తీసుకొచ్చాయి. దీనికి తోడు గ్రీన్ కలర్ జుమ్కాలు, సాఫ్ట్ మేకప్, ఓపెన్ హెయిర్ వేవ్స్‌తో జాన్వీ లుక్ అదరగొట్టింది.

'పెద్ది' వివాదం.. లైనప్‌లో క్రేజీ సినిమాలు:

ఇక సినిమాల విషయానికి వస్తే, జాన్వీ కపూర్ ఇటీవల తెలుగులో 'పెద్ది' సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్రను కాస్త ఎక్కువ గ్లామరస్‌గా చూపించారనే వివాదం నడవడంతో, డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పి సినిమాలో కొన్ని మార్పులు కూడా చేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ 'రాకా'తో పాటు ఒక భారీ హారర్ సినిమా కూడా ఉంది.

ఫ్యాషన్ ప్రపంచంలో జాన్వీ కపూర్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. సోదరి పెళ్లి రిసెప్షన్‌లో ట్రెడిషనల్ బనారసి చీరతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, మెహందీ ఫంక్షన్‌లో మాత్రం ఈ రెండున్నర కోట్ల వాచ్‌తో లగ్జరీకి సరికొత్త డెఫినిషన్ ఇచ్చింది. ఈ రేంజ్ లగ్జరీ మెయింటైన్ చేయడం కేవలం జాన్వీకే సాధ్యమంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News