ఇన్‌స్టాలో ట్రోల్ చేయకండి: డైరెక్టర్ జానకిరామ్ స్పీచ్!

జానకిరామ్ మారెళ్ల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై కిట్టు కర్నాటి, సీత కర్నాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Update: 2026-09-06 03:15 GMT

శ్రీ విష్ణు హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియడ్ ఎంటర్‌టైనర్ కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ ఆడియన్స్‌లో మంచి బజ్ తెచ్చుకుంది. జానకిరామ్ మారెళ్ల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై కిట్టు కర్నాటి, సీత కర్నాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ ఆర్కే సినీప్లెక్స్‌లో గ్రాండ్‌గా జరిగింది.

వేదికపై తొలిసారి మైక్ అందుకున్న డెబ్యూ డైరెక్టర్ జానకిరామ్ మారెళ్ల చాలా సరదాగా మాట్లాడుతూ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండటంతో కాస్త నెర్వస్‌గా ఉందని జానకిరామ్ అన్నారు. ఒకవేళ తడబడి అటు ఇటుగా మాట్లాడినా యూట్యూబ్‌లో కాస్త పద్ధతిగా కామెంట్లు పెట్టాలని, ఇన్స్టాగ్రామ్‌లో మాత్రం ట్రోల్ చేసి ఆడుకోవద్దని రిక్వెస్ట్ చేయడంతో ఆడిటోరియంలో అందరూ నవ్వేశారు.

తనను సపోర్ట్ చేయడానికి విచ్చేసిన సీనియర్ దర్శకులు, గెస్ట్‌లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

హీరో శ్రీ విష్ణు అందించిన సహకారం గురించి చెబుతూ జానకిరామ్ ఎమోషనల్ అయ్యారు. మొదటి రోజు కథ విన్నప్పటి నుంచి నేటి వరకు శ్రీ విష్ణు నిరంతరం వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. ఒక కొత్త దర్శకుడికి శ్రీ విష్ణు లాంటి డెడికేటెడ్ హీరో దొరకడం నిజంగా దేవుడిచ్చిన గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్లే కథను అనుకున్న విధంగా వెండితెరపై ఆవిష్కరించగలిగానని తెలిపారు.

రైటర్, సమర్పకుడు కోన వెంకట్‌కు థ్యాంక్స్ చెబుతూ ఆయన లేకపోతే తాను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండేవాడినే కాదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ జర్నీలో కోన వెంకట్ దగ్గర ఎన్నో కొత్త విషయాలు, సినిమా పాఠాలు నేర్చుకున్నానని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఆయన చేయి తనపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకున్నారు.

నిర్మాత కిట్టు కర్నాటి కూల్ ఆటిట్యూడ్ గురించి మాట్లాడుతూ ఫన్నీ కామెంట్స్ చేశారు. సినిమా కోసం ఎంత బడ్జెట్ పెడుతున్నా, ఖర్చు పెరుగుతున్నా ఆ టెన్షన్ మొహంలో అస్సలు కనిపించదని చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ పక్కన ఉంటూ ఒక వెల్‌విషర్‌లా ముందుకు నడిపించారని, ప్రతి చిన్న విషయాన్ని కలిసి చర్చించుకుంటూ మొదటి రోజు నుంచే ఫుల్ సపోర్ట్ ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు.

ఎడిటర్ చోటా కె. ప్రసాద్ బాగా సపోర్ట్ చేశారని, మంచి చెడు ఏదున్నా ఎప్పుడూ పక్కనే నిలబడతాడని గుర్తు చేసుకున్నారు. కెమెరామెన్ సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో పాటు తన డైరెక్షన్ టీమ్ మొత్తానికి థాంక్స్ చెప్పారు. కంగారులో మొదట డిసెంబర్ 9న కలుద్దామని తప్పుగా చెప్పి, వెంటనే సారీ చెబుతూ అక్టోబర్ 9న థియేటర్లలో కలుద్దామంటూ జానకిరామ్ తన స్పీచ్‌ను సరదాగా ముగించారు.



Tags:    

Similar News