మహాకాళిలో సర్ప్రైజ్.. ప్రమోషన్ మోడల్ వర్కౌట్ కావాలంటే..
మహాకాళి సినిమాకు పూజ కొల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టి టైటిల్ రోల్ లో కనిపించనుండగా.. ధురంధర్ ఫేమ్ అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు.
విజువల్ ఫాంటసీ కథలకు ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులోనూ కథకు సంబంధించిన కీలక విషయాలు పూర్తిగా బయటపెట్టకుండా.. ఒక్కో పాత్రను, ఒక్కో విజువల్ ను పరిచయం చేస్తూ క్యూరియాసిటీ పెంచితే ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది. ప్రస్తుతం మహాకాళి సినిమా విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. సినిమాలో ఏం ఉండబోతోందనే దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వకుండా.. ప్రేక్షకుల్లో ప్రశ్నలు మిగిలేలా ప్రచారం సాగుతోంది.
మహాకాళి సినిమాకు పూజ కొల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టి టైటిల్ రోల్ లో కనిపించనుండగా.. ధురంధర్ ఫేమ్ అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన విజువల్స్ లో శుక్రాచార్యుడి పాత్రకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆసక్తిని పెంచింది. అలాగే అమ్మవారి పాత్రలో శ్రేయా రెడ్డి కనిపించే విధానం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఇంతవరకు సినిమాలోని పూర్తి క్యారెక్టర్ లైనప్ ను మాత్రం బయటపెట్టలేదు.
ఇక్కడే మహాకాళి ప్రమోషన్ మోడల్ ఆసక్తికరంగా మారింది. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ లో హీరో, హీరోయిన్, ఇతర కీలక నటీనటుల లుక్స్ ను వరుసగా విడుదల చేస్తుంటారు. కానీ సినిమా విషయంలో మాత్రం పూర్తి వివరాలను ఒకేసారి వెల్లడించకుండా.. కొంత సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. దీంతో అసలు కథ ఏంటి? హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతోంది? ఇంకా ఎవరెవరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మొదలవుతున్నాయి.
ముఖ్యంగా హీరోయిన్ ను ఇప్పటివరకు పూర్తిగా రివీల్ చేయకపోవడం మరో ఆసక్తికర అంశంగా మారింది. భూమి శెట్టి టైటిల్ పాత్రలో కనిపించనున్నప్పటికీ.. ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే సినిమాలో మరికొంతమంది ముఖ్యమైన నటీనటులు ఉన్నారనే ఆసక్తి నెలకొంది. వాళ్లను ఎప్పుడు పరిచయం చేస్తారు? ఎలాంటి పాత్రల్లో చూపిస్తారు? అనేది ఇప్పటికీ సస్పెన్సే.
అలా సినిమా కథను మొత్తం చెప్పకుండా.. ప్రేక్షకుల్లో ప్రశ్నలు రేకెత్తించడం ద్వారా వారిని తదుపరి అప్డేట్స్ కోసం ఎదురుచూసేలా చేయడమే ప్రమోషన్ విధానం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒక పాత్ర చూపించినప్పుడు దాని వెనుక కథ ఏంటనే ఆసక్తి.. మరో లుక్ వచ్చినప్పుడు ఆ పాత్రకు సంబంధం ఏంటనే క్యూరియాసిటీ.. ఇలా ఒక్కో అప్డేట్ తో అంచనాలను పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పటికే శుక్రాచార్యుని పాత్ర, అమ్మవారి విజువల్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాయి.
దీంతో మూవీ నుంచి తర్వాత రివీల్ చేయబోయే పాత్రలపై కూడా ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఇప్పటివరకు చూపించని పాత్రల్లో ఏదైనా పెద్ద సర్ప్రైజ్ ఉంటుందా? అనే చర్చ మొదలవుతోంది. సినిమా కథలో కీలకమైన పాత్ర చివరి వరకు దాచిపెట్టి.. సరైన సమయంలో రివీల్ చేస్తే హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ తరహా ప్రమోషన్ పూర్తిగా వర్కౌట్ కావాలంటే చివరకు చూపించే కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉండాలి. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.