'జైలర్ 2' లో విలన్ ని మార్చడం మైనస్సా? ప్లస్సా?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `జైలర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది.;
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `జైలర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్లో పండాయో? అంతకు మించి వర్మ విలన్ కామెడీ ట్రాక్ వర్కౌట్ అయింది. వినాయకన్ విలన్ అయినా? అతడి పాత్రలో కామెడీ సినిమాకు కలిసొచ్చింది. అతడి ఆహార్యం, హావభావాలు సినిమాకు పిల్లర్ లా నిలిచాయి. సినిమాలో ఓ హీరో రజనీకాంత్ అయితే? మరో హీరోలా వినాయకన్ పాత్ర నిలుస్తుంది. వర్త్ వర్మ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే.
వర్మ పాత్రతో పాటు కమెడియన్ పాత్ర అంతే హైలైట్ అవుతుంది. అయితే ఆ రెండు పాత్రలు క్లైమాఆక్స్ లో చనిపోతాయి. మరి సీక్వెల్ లో ఈ రెండు పాత్రలు ఉంటాయా? ఉండవా? అన్న దానిపై సందేహాలున్నాయి. 'జైలర్ 2' లో చాలా పాత్రలు యధావిగా ఉన్నాయి. హీరో సహా కీలక పాత్రలు పోషించిన వారంతా నటిస్తున్నారు. అదనంగా కొన్ని కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి. ఈసారి సినిమాలో ప్రధాన విలన్ గా ఎస్. జె సూర్య నటిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఆ పాత్రతో తాను చెప్పాలనుకున్నదంతా చెప్పించబోతున్నాడు.
కానీ వినాయకన్ పాత్రలా సూర్య పాత్ర మాత్రం కామెడీగా హైలైట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇద్దరు వేర్వేరు నటులు. వినాయకన్ సీరియస్ రోల్ సహా కమెడియన్ గానూ రాణించగలడు. కానీ సూర్య మాత్రం సీరియస్ రోల్ తప్ప కామిక్ గా వర్కౌట్ కాదు. మరి చనిపోయిన వర్మ పాత్రకు మరో రకంగా ప్రాణం పోయగల్గితే సినిమాకు అతి పెద్ద ప్లస్ గా చెప్పొచ్చు. జైలర్ మొదటి భాగంలో వర్మ పాత్ర చనిపోతుంది కాబట్టి...రెండవ భాగంలో అలాగే చూపించడానికి ఛాన్స్ లేదు. కానీ మరో పాత్ర రూపంలో వినాయకన్ ని చూపించొచ్చు.
కానీ దర్శకుడు మాత్రం ఆ ఛాన్స్ తీసుకున్నట్లు కనిపించలేదు. వినాయకన్ నటిస్తున్నట్లు ఇంతవరకూ ఎలాంటి ప్రచారం కూడా జరగలేదు. భారమంతా సూర్య పాత్రపైనే వేసినట్లు కనిపిస్తుంది. మరో కమెడియన్ గా యోగిబాబు నటిస్తున్నాడు. అలాగే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు బాలకృష్ణ, మిథున్ చక్రవర్తి కూడా ఈ సారి రెండబవ భాగంలో భాగమవ్వడం విశేషం. మరి కొత్తగా యాడ్ అయిన పాత్రలను తెరపై ఎలా ఆవిష్కరిస్తున్నారు అన్నది చూడాలి.