జై హనుమాన్ ట్రీట్ కు రెడీనా?
తేజా సజ్జ, ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన హను మాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.;
తేజా సజ్జ, ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన హను మాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అనౌన్స్ అయితే చేశారు కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి డెవలప్‌మెంట్ కనిపించలేదు. అందరూ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న జైహనుమాన్ నుంచి ఓ కొత్త డెవలప్‌మెంట్ కనిపిస్తోంది. జై హనుమాన్ లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
తాజా సమాచారం ప్రకారం, జులై 7న రిషబ్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా జై హనుమాన్ నుంచి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ట్రీట్ వీడియో రూపంలో ఉంటుందని కూడా అంటున్నారు. అంటే చిన్న వీడియో గ్లింప్స్ లేదా టీజర్ అయుండొచ్చు. జులై 7న రిషబ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ వీడియోను రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
అయితే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టి సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తేజ సజ్జా కూడా ఓ పాత్ర చేస్తున్నట్టు గతేడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్ఫర్మ్ చేశారు.
కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన హను మాన్ సినిమా 2024లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలవగా, ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న జై హనుమాన్ పై అందరికీ అంచనాలు భారీగా ఉండటం సహజం. జై హనుమాన్ సినిమా హనుమంతుడి గొప్పతనాన్ని తెలియచేస్తుందని మేకర్స్ గతంలోనే వెల్లడించారు. 2025లోనే జై హనుమాన్ రిలీజ్ అవుతుందని, హను మాన్ సినిమా క్లైమాక్స్ లో చెప్పినప్పటికీ, ఇప్పుడది జరిగేలా కనిపించడం లేదు.
వాస్తవానికి జై హనుమాన్ సినిమా షూటింగ్ ఈ పాటికే ఆఖరి దశకు చేరుకోవాల్సింది కానీ రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్1 పనుల్లో బిజీగా ఉండటం వల్ల జై హనుమాన్ కు వెయిటింగ్ ఎక్కువైంది. అక్టోబర్ 2న కాంతార చాప్టర్1 రిలీజ్ కానుంది. 2022లో కాంతార సినిమాతో హిందీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న రిషబ్, జై హనుమాన్ తో అన్ని భాషల ఆడియన్స్ ను ఆకట్టుకుని తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నారు.