జై హనుమాన్ కి షాక్ ఇచ్చేలా వారణాసి..?

మన సినీ మేకర్స్ అంతా పురాణ కథల మీద ఆసక్తి పెంచుకున్నారు. మహాభారత రామాయణ కథలతో ఎన్ని సినిమాలు వచ్చినా ఎప్పుడు కూడా అలాంటి సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.;

Update: 2025-11-17 06:13 GMT

మన సినీ మేకర్స్ అంతా పురాణ కథల మీద ఆసక్తి పెంచుకున్నారు. మహాభారత రామాయణ కథలతో ఎన్ని సినిమాలు వచ్చినా ఎప్పుడు కూడా అలాంటి సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇతిహాసాలను నేటితరం యువతకు అందించాలనే ఉద్దేశ్యంతో కల్పిత కథకు పురాణాల రిఫరెన్స్ తీసుకుని చేస్తున్న ప్రయత్నాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కార్తికేయ 2 అప్పట్లో సూపర్ హిట్ కాగా రెండేళ్ల క్రితం వచ్చిన హనుమాన్ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

ప్రశాంత్ వర్మ రిషబ్ ని ఎలా వాడుకుంటాడు..

జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టిని లీడ్ రోల్ కి ఎంపిక చేశారు. కాంతారా, కాంతారా చాప్టర్ 1 సినిమాలు చూశాక ప్రశాంత్ వర్మ రిషబ్ ని ఎలా వాడుకుంటాడా అన్న ఎగ్జైట్ మెంట్ మొదలైంది. ఐతే ప్రశాంత్ వర్మ మీద నిర్మాతల మండలిలో కంప్లైంట్ వెళ్లడం తెలిసిందే. జై హనుమాన్ తో పాటు ప్రశాంత్ వర్మ మరికొన్ని సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వడం వల్లే ఈ చిక్కులు వచ్చి పడ్డాయి.

ఐతే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో రిషబ్ శెట్టి లీడ్ రోల్ కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఐతే ఓ పక్క బాలీవుడ్ లో నితీష్ తివారి రామాయణ అంటూ ఒక భారీ సినిమా చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ వేల కోట్లు అని తెలుస్తుంది. ఇక మరోపక్క రాజమౌళి మహేష్ సినిమా వారణాసి కూడా రామాయణ ఘట్టాలను చూపిస్తారని అంటున్నారు.

బాలీవుడ్ రామాయణ వల్ల జై హనుమాన్ మీద..

బాలీవుడ్ రామాయణ వల్ల జై హనుమాన్ మీద ఏమంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉండకపోవచ్చు కానీ రాజమౌళి చేస్తున్న వారణాసి మాత్రం రామాయణ ఘట్టాల్లో హనుమాన్ గురించి కూడా చూపించే ఛాన్స్ ఉంది. అసలే వారణాసి గ్లింప్స్ లో రావణ లంకలో ఒక ఫ్రేం చూపించాడు రాజమౌళి. సో వారణాసిలో రాముడితో హనుమంతుడి సీన్స్ ఉండేలా ఉన్నాయి.

ఇటు ఓ పక్క జై హనుమాన్ అంటూ రామ రావణ యుద్ధంలోని ఘట్టాలు ఆంజనేయుడి వీర సాహసాలతో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కథ రాసుకున్నాడు. మరి వారణాసి కన్నా ముందు హై హనుమాన్ వస్తే పర్లేదు కానీ ఒకవేళ ప్రశాంత్ వర్మ మరీ లేట్ చేస్తే మాత్రం కచ్చితంగా వారణాసి ఎఫెక్ట్ జై హనుమాన్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ, రాజమౌళి ఎవరి విజన్ వారిదే అయినా రాజమౌళి సినిమా చూశాక మళ్లీ అలాంటి కాన్సెప్ట్ మరొకరు చెబితే ఎక్కుతుంది అన్న డౌట్ ఆడియన్స్ లో మొదలైంది.

ప్రశాంత్ వర్మ మిగతా విషయాలు అన్నీ పక్కన పెట్టి..

అందుకే ప్రశాంత్ వర్మ మిగతా విషయాలు అన్నీ పక్కన పెట్టి జై హనుమాన్ ని పూర్తి చేసి రిలీజ్ చేయడంలో ఫోకస్ చేస్తే బెటర్ అని అంటున్నారు. మరి జై హనుమాన్ అనుకున్న విధంగా ఒక డేట్ పెట్టుకుని పూర్తి చేస్తారా లేదా ప్రశాంత్ వర్మ మీద వచ్చిన అలిగేషన్స్ అన్ని క్లారిటీ వచ్చాక సినిమా మొదలు పెడతారా అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News