ఆ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
అదే మెగాస్టార్ నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ మూవీ రిలీజై 35 ఏళ్లవుతున్న సందర్భంగా దర్శకనిర్మాతలు ఈ సినిమాను రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.;
టాలీవుడ్ లో ఈ మధ్య రీరిలీజ్ ల క్రేజ్ బాగా పెరిగిపోయింది. కొత్త, పాత సినిమాలతో సంబంధం లేకుండా అన్నీ సినిమాలనూ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ రీరిలీజ్ లు చూసుకుని ఫ్యాన్స్ మురిసిపోతుంటే, నిర్మాతలు మాత్రం డబ్బులు జేబులో వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓ క్రేజీ సినిమా రీరిలీజ్ కు రెడీ అయింది.
అదే మెగాస్టార్ నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ మూవీ రిలీజై 35 ఏళ్లవుతున్న సందర్భంగా దర్శకనిర్మాతలు ఈ సినిమాను రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మే 9న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ రీరిలీజ్ ను ఎంతో భారీగా 2డీ, 3డీలో ప్లాన్ చేస్తున్నారు. థియేటర్ల దగ్గర హోర్డింగులు పెట్టడంతో పాటూ రీరిలీజ్ సందర్భంగా రాఘవేంద్ర రావు, చిరంజీవి, అశ్వినీదత్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేసి దాన్ని రిలీజ్ చేయగా ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.
ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపడ్డాయి. వాస్తవానికి ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని నిర్మాత అశ్వినీదత్ చాలా కాలంగా అనుకుంటున్నారు. పైగా ఈ సినిమాకు సీక్వెల్ తీసే వీలు కూడా ఉంది. క్లైమాక్స్ లో శ్రీదేవి ఉంగరం సముద్రంలో పడేయడం,దాన్ని ఓ చేప పిల్ల మింగడం తో సినిమా ముగుస్తుంది.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ చేయాలంటే సరిగ్గా క్లైమాక్స్ నుంచి కొత్త కథను రాసుకుని చేసే వీలుంది. ఈ సీక్వెల్ ను చిరంజీవి కొడుకు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో చేయాలనేది ప్లాన్. దీని కోసం అశ్వినీదత్ ఎంతో ట్రై చేశాడు కానీ వర్కవుట్ అవలేదు. ఈ ప్లాన్ ఫ్యూచర్ లో కూడా కుదిరే ఛాన్సుల్లేవని ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ వచ్చేసింది.
చిరూగా చరణ్ కనిపిస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ శ్రీదేవిని మ్యాచ్ చేయడం జాన్వీ వల్ల కాదనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. శ్రీదేవిని మరొకరితో రీప్లేస్ చేయడం అసాధ్యమని, ఇళయరాజా సాంగ్స్ ను మళ్లీ ఆ రేంజ్‌లో రీక్రియేట్ చేయలేమని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. సో జగదేకవీరుడు సీక్వెల్ ప్లాన్ మానుకోవడం బెటర్.