వీడియో: సాహో బ్యాడ్ గ‌ర్ల్ పోల్ డ్యాన్స్

తాజాగా జాక్విలిన్ త‌న టోన్డ్ ఫిజిక్ ని ఎలివేట్ చేస్తూ పోల్ డ్యాన్స్ చేసిన వీడియోని షేర్ చేయ‌గా, అది ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.;

Update: 2025-08-02 20:30 GMT

డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన భారీ యాక్ష‌న్ చిత్రం `సాహో` విడుద‌లై ఆరేళ్ల‌యింది. అయినా ఇప్ప‌టికీ ఈ సినిమాలో `బ్యాడ్ బోయ్..` సాంగ్ అభిమానుల ఫేవ‌రెట్ పాట‌ల‌లో ఒక‌టిగా ఉంది. దానికి కార‌ణం ఈ ప్ర‌త్యేక గీతంలో గ్లామ‌ర‌స్ క్వీన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ అందాల ఆర‌బోత‌, టీజింగ్ ఎక్స్ ప్రెష‌న్స్.. క‌వ్వించే యాటిట్యూడ్.

మ‌హేష్ తో మిస్స‌యినా కానీ..

అయితే `సాహో` త‌ర్వాత కూడా టాలీవుడ్ లో ఐట‌మ్ నంబ‌ర్ల‌లో ఆడిపాడుతుంద‌ని భావించినా అది వీలుప‌డ‌లేదు. `సాహో` కంటే ముందే మ‌హేష్ 1-నేనొక్క‌డినే సినిమాలో జాక్విలిన్ ఐట‌మ్ నంబ‌ర్ లో న‌ర్తిస్తుంద‌ని ప్రచారం సాగినా, చివ‌రికి ఆ అవ‌కాశం సోఫీ చౌద‌రిని వ‌రించింది. జాక్విలిన్ ఈ ఐదారేళ్ల‌లో బాలీవుడ్ వ‌ర‌కే ప‌రిమిత‌మైంది.

జంగిల్ లో జాకీ ట్రీట్ కి సిద్ధం:

ఇటీవ‌లే విడుద‌లైన `హౌస్ ఫుల్ 5`లో జాక్విలిన్ గ్లామ‌ర్ డాళ్ పాత్ర‌లో క‌నిపించింది. అడ‌ల్ట్ కామెడీలో జాకీ అందాల ఆర‌బోత‌కు యూత్ ఫిదా అయిపోయింది. త‌దుప‌రి మ‌రో భారీ ఫ్రాంఛైజీ చిత్రం `వెల్ కం టు ది జంగిల్`లోను జాకీ గ్లామ‌ర‌స్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ప్ర‌స్తుతానికి జాక్విలిన్ బాలీవుడ్ లో మాత్ర‌మే న‌టిస్తోంది. తెలుగు, త‌మిళంలో ఈ బ్యూటీకి అవ‌కాశాల్లేవ్.

చాలా ఎన‌ర్జీ కావాలి:

అయినా సోష‌ల్ మీడియాల్లో ఈ బ్యూటీకి అంత‌కంత‌కు ఫాలోయింగ్ పెరుగుతోంది. జాకీ నిరంత‌ర బోల్డ్ ఫోటోషూట్ల‌కు ఇన్ స్టా వేదిక‌గా భారీ క్రేజ్ నెల‌కొంది. తాజాగా జాక్విలిన్ త‌న టోన్డ్ ఫిజిక్ ని ఎలివేట్ చేస్తూ పోల్ డ్యాన్స్ చేసిన వీడియోని షేర్ చేయ‌గా, అది ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం చాలా శ‌క్తి, కాన్ స‌న్ ట్రేష‌న్ తో పాటు, గ్రిప్ అవ‌స‌రం. పోల్ పై ఎక్క‌డా బ్యాలెన్స్ త‌ప్ప‌కుండా జాకీ గ్రిప్పింగ్ గా ట్రీట్ అందించింది. వైట్ క్రాప్డ్ టాప్ బ్లాక్ స్కర్ట్ ధరించి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ వీడియో క్లిప్‌లో అద్భుతంగా కనిపించింది.

పోల్ డ్యాన్స్ తో ప్ర‌యోగం ఇష్టం:

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్వ‌త‌హాగా ఫిట్నెస్ ఫ్రీక్. పోల్ డ్యాన్స్ తో తనను ఫిట్‌గా ఉంచుకోవ‌డానికి చాలా ప్రాక్టీస్ చేస్తుంది. ఫిట్నెస్ తోనే మాన‌సిక ప్ర‌శాంత‌త సాధ్య‌మ‌ని న‌మ్మే జాక్విలిన్ రెగ్యుల‌ర్ గా పోల్ డ్యాన్స్ కి ప్రాధాన్య‌త‌నిస్తాన‌ని చెప్పింది. ఇది అందం గురించి కాదు.. ఆరోగ్యం కోసం ఆధ్యాత్మిక ప్ర‌యాణం అని కూడా వెల్ల‌డించింది. బ‌ల శిక్షణ, యోగా లేదా నృత్యం ఆరోగ్యం కోసం.. దీనికి అద‌నంగా ర‌క‌ రకాల వ్యాయామాలను దిన‌చ‌ర్య‌లో చేర్చాలని అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ ఆస‌క్తిని పెంచుతాయి అని ఈ శ్రీ‌లంక‌న్ బ్యూటీ చెప్పింది.

Tags:    

Similar News