• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోడ‌ల్ కం రాజ‌కీయ...

మోడ‌ల్ కం రాజ‌కీయ నాయ‌కుడితో స్టార్ డాట‌ర్ డేటింగ్?

| క‌ట్ చేస్తే ఇప్పుడు ఆ ఇద్ద‌రూ ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రంలో జంట‌గా క‌నిపించి అంద‌రికీ షాకిచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-10-31 14:30 GMT

అత‌డు ప్ర‌ముఖ మోడ‌ల్.. ఎం.ఎం.ఏ ఫైట‌ర్.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. పంజాబీ ధ‌నిక కుటుంబంలో జ‌న్మించాడు. ముంబైలో మోడ‌లింగ్ చేస్తూ, న‌టుడిగాను కొన‌సాగుతున్నాడు. ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోను ప‌ని చేసాడు. చాలా కాలంగా ప్ర‌ముఖ న‌టుడి కుమార్తెను సోష‌ల్ మీడియాల్లో అనుస‌రిస్తున్నాడు. కానీ స‌ద‌రు న‌ట‌వార‌సురాలు అత‌డిని అనుస‌రించ‌డం లేదు. క‌ట్ చేస్తే ఇప్పుడు ఆ ఇద్ద‌రూ ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రంలో జంట‌గా క‌నిపించి అంద‌రికీ షాకిచ్చారు. ఈ జంట డేటింగ్ లో ఉందంటూ ఒక‌టే ప్ర‌చారం.. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...


ప్ర‌ముఖ న‌టి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ శృంగార సంబంధాలు ఎల్లపుడూ అభిమానుల్లో ఆస‌క్తిని పెంచుతూనే ఉన్నాయి. ఇంత‌కుముందు కేదార్ నాథ్ చిత్రంతో సారా క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. ఆ స‌మ‌యంలో స‌హ‌న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసింది. ఈ విష‌యాన్ని డ్ర‌గ్స్ కేసును విచారించిన‌ ఎన్సీబీ ద‌ర్యాప్తులో సారా స్వ‌యంగా అంగీక‌రించింది. ఆ త‌రవాతా ప‌లువురు యువ‌క‌థానాయ‌కుల‌తో సారా డేటింగ్ చేసింద‌ని ప్ర‌చార‌మైంది. ముఖ్యంగా ప‌రిశ్ర‌మ అగ్ర‌ హీరోల‌కు ధీటుగా రాణిస్తున్న కార్తీక్ ఆర్య‌న్ లాంటి కుర్ర‌హీరోతో సారా గుట్టు చ‌ప్పుడు కాకుండా డేటింగ్ చేసింద‌ని ప్ర‌చార‌మైంది.

అదంతా అటుంచితే ఇప్పుడు మ‌రో కొత్త యువ‌కుడితో సారా అలీఖాన్ క‌నిపించింది. ఈ వార్త నిజంగా త‌న‌ అభిమానులలో ఉత్సుకతను రేకెత్తించింది. ఇటీవల కేదార్‌నాథ్ పర్యటనలో సూపర్ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా క‌నిపించింది. ఆ తర్వాత ఆమె డేటింగ్ జీవితం గురించి ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాల‌లో, ముఖ్యంగా రెడ్డిట్‌లో వైరల్‌గా మారాయి. వారు శృంగార సంబంధంలో ఉన్నారా? అంటూ నెటిజ‌నులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ ఫోటోగ్రాఫ్‌లో సారా - అర్జున్ ఒక ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఒకరికొకరు దగ్గరగా నిలబడి ఉన్నారు. అయితే ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా కానీ, వారి రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజ‌కీయ నాయ‌కుడు అయిన‌ అర్జున్ చాలా కాలంగా సారాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండగా, ఆమె ఇప్పటికి అతడిని ఫాలో అవ్వడం లేదు.

కానీ ఇప్పుడు ఇద్ద‌రూ స‌న్నిహితంగా క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ క‌ల‌యిక కేవ‌లం యాధృచ్ఛిక‌మా? ఏదైనా ప్ర‌క‌ట‌న కోసం న‌టించారా? అన్న అనుమానాలు కూడా తెర‌పైకొచ్చాయి. ఒక నెటిజ‌న్ ఇలా వ్యాఖ్యానించారు, ``అర్జున్ చాలా ప్రముఖ పంజాబీ రాజకీయవేత్త కుమారుడు. అతడు మంచి వ్యక్తి. నేను అతని స్నేహితుల స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. అతడు జాలి దయగల యువ‌కుడు. ముంబైలో మోడల్. అతడు చాలా ధనవంతుడు. (సైఫ్ అలీ ఖాన్ అంత‌టి ధనవంతుడు కాదు, కానీ ధనవంతుడు). అయితే ఈ జంట‌పై వ‌స్తున్న డేటింగ్ పుకార్లను కొట్టి పారేస్తున్నారు కొందరు అభిమానులు. మీ ఊహ‌లు నిజం కావు.. వారు డేటింగ్ చేయడం లేదు. అర్జున్, నేను ఒకే సామాజిక వ‌ర్గం గ్రూప్ లో ఉన్నాం..కాబట్టి నేను దీనికి హామీ ఇవ్వగలను ఒక‌రు అన్నారు.

అర్జున్ ప్రతాప్ బజ్వా కేవలం మోడల్ మాత్రమే కాదు.. అతడు అద్భుతమైన కళాకారుడు కూడా. అతడు రోహిత్ - వరుణ్ బాల్ వంటి అగ్రశ్రేణి డిజైనర్ల కోసం ర్యాంప్ పై నడిచాడు. ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ మేకర్ గిరీష్ మాలిక్ దర్శకత్వం వహించిన `బ్యాండ్ ఆఫ్ మహారాజాస్` చిత్రంలో కనిపించాడు. 2013 చిత్రం `స్లింగ్`లో ప్రభుదేవా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. రాజకీయంగా చురుకుగా ఉన్నాడు. అర్జున్ 2022 నాటికి పంజాబ్ జిల్లా కౌన్సిల్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి అతి పిన్న వయస్కుడైన ప్రతినిధిగా గుర్తింపు పొందారు. అర్జున్ విద్యా నేపథ్యం సనావర్‌లోని లారెన్స్ స్కూల్ నుండి రాజకీయాలు, వ్యవసాయంలో డిగ్రీలు పూర్తి చేసాడు. అతని మోడలింగ్ వృత్తికి మించి అతడు నైపుణ్యం కలిగిన జిమ్నాస్ట్... MMA ఫైటర్ కూడా.

Tags:    
  • Bollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Saifalikhan 
  • Saraalikhan 
  • Kedarnath 
  • SushantSinghRajput 
  • NCBinvestigation 
  • KartikAaryan 
  • ArjunPratapBajwa 
  • Socialmedia 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS