థియేటర్ల కేటాయింపు.. ప్రేక్షకుడి డిమాండా? డిస్ట్రిబ్యూటర్ పవరా?

ఇక అసలు థియేటర్లు ప్రేక్షకుడి డిమాండ్‌ ప్రకారం ఇవ్వాలా లేక డిస్ట్రిబ్యూటర్ పవర్‌ ఆధారంగా కేటాయించాలా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-08-24 10:13 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ ఈ ఏడాది మొదటి ఐదు-ఆరు నెలలు పెద్దగా సినిమాలు లేక బోసిపోయిన, గత రెండు నెలల నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కళకళలాడుతోంది. 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'DC', లతో మొదలైన వసూళ్ల సునామీ, గతవారం వచ్చిన రవితేజ 'ఇరుముడి' చిత్రంతో మరింత పెరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ థియేటర్ బిజినెస్‌లో స్క్రీన్ల కేటాయింపు పెద్ద రచ్చగా మారింది. ఇక అసలు థియేటర్లు ప్రేక్షకుడి డిమాండ్‌ ప్రకారం ఇవ్వాలా లేక డిస్ట్రిబ్యూటర్ పవర్‌ ఆధారంగా కేటాయించాలా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

లాభాల బాటలో రవితేజ 'ఇరుముడి':

రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది. విడుదలై రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రస్తుతం భారీ లాభాల దిశగా దూసుకెళ్తోంది. మంచి ఆక్యుపెన్సీ సాధిస్తూ, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెడుతున్న తరుణంలో స్క్రీన్ల కోత భయం పట్టుకుంది. ఇక దీనికి తోడు గతవారం నాటి సూర్య మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'DC' సినిమాలు కూడా ఇంకా మంచి వసూళ్లు రాబడుతుండటం విశేషం.

'టాక్సిక్' ఎంట్రీతో మొదలైన థియేటర్ల యుద్ధం:

ఇలాంటి హౌస్‌ఫుల్ వాతావరణం మధ్యలో పాన్-ఇండియా స్థాయి క్రేజ్‌తో 'టాక్సిక్' మూవీ భారీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇక అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లైన దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, నాగవంశీలకు ఈ వారం స్క్రీన్ల కేటాయింపు పెద్ద సవాలుగా మారింది. భారీ డబ్బింగ్ సినిమా కోసం ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న సినిమాల థియేటర్లను తగ్గించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

డిమాండా? డిస్ట్రిబ్యూషన్ పవరా?:

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న స్వదేశీ 'ఇరుముడి' రన్ అవుతున్న థియేటర్లను తగ్గించి, కేవలం క్రేజ్ ఉందని డబ్బింగ్ సినిమా 'టాక్సిక్'కు ఇచ్చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇక థియేటర్ల కేటాయింపులు అనేది ప్రేక్షకులు దేనికి క్యూ కడుతున్నారు అనే దాని ఆధారంగా జరగాలా, లేక పెద్ద బ్యానర్ల డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ బలం ఆధారంగా జరగాలా అని సినీ ప్రేమికులు నిలదీస్తున్నారు.

చివరికి గెలిచేది ఎవరు? :

బిజినెస్ లెక్కలు, బడా డిస్ట్రిబ్యూటర్ల పవర్ గేమ్స్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, రోజువారీ థియేటర్ రన్ విషయంలో చివరికి ప్రేక్షకుడి ఆదరణే గెలుస్తుందా లేదా పెద్ద బ్యానర్ల ఆధిపత్యమే నడుస్తుందా అనేది ఈ వారం థియేటర్ మార్కెట్ నిర్ణయించనుంది అన్నది ఇండ్రస్ట్రీ వర్గాలలో టాక్.

ఇక కంటెంట్ బాగుంటే చిన్నదా పెద్దదా అని చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సినిమాలకు తగినన్ని థియేటర్లు కేటాయిస్తూనే, కొత్త సినిమాలకు స్పేస్ ఇవ్వడమే నిజమైన సినీ పరిశ్రమ ధర్మం. ఇక ఈ థియేటర్ల వివాదంలో అగ్ర డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి సమతుల్యత పాటిస్తారో చూడాలి.

Tags:    

Similar News