ఇరుముడిని తీసేస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా?

ఇరుముడి సినిమా బాక్సాఫీస్ దగ్గర రేపుతున్న సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. టైర్-1 హీరోలను పెట్టి భారీ బడ్జెట్లలో తీసే పాన్ ఇండియా సినిమాలను మించి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.

Update: 2026-08-25 17:31 GMT

ఇరుముడి సినిమా బాక్సాఫీస్ దగ్గర రేపుతున్న సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. టైర్-1 హీరోలను పెట్టి భారీ బడ్జెట్లలో తీసే పాన్ ఇండియా సినిమాలను మించి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తొలి రోజు నుంచి వసూళ్ల మోత మోగిస్తూ.. ఏ దశలోనూ తగ్గకుండా దూసుకెళ్తోంది ‘ఇరుముడి’. వీకెండ్ తర్వాత కూడా సినిమాకు హౌస్ ఫుల్స్ కొనసాగుతున్నాయి. ఐతే ఇంత బాగా ఆడుతున్న సినిమాకు రేపట్నుంచి బాగా థియేటర్లు తగ్గించేయబోతున్నారు. రేపు దిల్ రాజు రిలీజ్ చేయబోతున్న ‘టాక్సిక్’ కోసం ‘ఇరుముడి’కి స్క్రీన్లు, షోలలో బాగా కోత వేయబోతున్నారు.

ముందు నుంచే మైత్రీ మూవీ మేకర్స్‌తో దిల్ రాజుకు విభేదాలు ఉన్నాయి. వీరి సినిమాలు ఒకేసారి పోటీకి వచ్చినపుడు.. దిల్ రాజే పైచేయి సాధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో విమర్శలు వచ్చినా ఆయన తగ్గింది లేదు. ఇప్పుడు మైత్రి వారి ‘ఇరుముడి’ ఇరగాడేస్తున్నా.. డబ్బింగ్ సినిమా ‘టాక్సిక్’ కోసం స్క్రీన్లు లాగేస్తుండడంతో మరోసారి దిల్ రాజు మీద వ్యతిరేకత వస్తోంది. దీని గురించి కొన్ని రోజుల ముందే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో దిల్ రాజును నెటిజన్లు టార్గెట్ చేశారు. అయినా సరే.. దిల్ రాజు థియేటర్లపై తనుకున్న పట్టుతో రాజు మెజారిటీ స్క్రీన్లను ‘టాక్సిక్’ కోసం తీసుకుంటున్నారు. ఈ సినిమా మీద భారీ పెట్టుబడి పెట్టడంతో రాజు రాజీ పడే ఛాన్సే కనిపించడం లేదు.

కానీ ‘టాక్సిక్’ ఒక వర్గం ప్రేక్షకులకే నచ్చే సినిమాలా కనిపిస్తోంది. టాక్ ఎలా ఉన్నా.. ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమా వైపు చూడడం కష్టమే. వారికి రాబోయే వీకెండ్లో కూడా ‘ఇరుముడి’నే ఛాయిస్ కాబోతోంది. కానీ ఆ సినిమాకు డిమాండుకు సరిపడా స్క్రీన్లు, షోలు దక్కేలా లేవు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు నిరాశ పడాల్సి ఉంటుందేమో. కాబట్టి సోషల్ మీడియాలో వ్యతిరేకత తప్పేలా లేదు. దీని వల్ల ‘ఇరుముడి’కి సానుభూతి కూడా పెరగొచ్చు. గతంలో ‘గుంటూరు కారం’ వల్ల ‘హనుమాన్’కు ఇబ్బంది ఎదురైనపుడు ఆడియన్స్ ఆ సినిమా వైపు నిలిచారు. దాని వల్ల ‘గుంటూరు కారం’ దెబ్బ తింది. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News