గంటలో లక్ష టికెట్లు.. ‘టాక్సిక్’ జెట్ స్పీడ్!

యశ్ ‘టాక్సిక్’ థియేటర్లలోకి రావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ కూడా పెరుగుతోంది.

Update: 2026-08-25 17:33 GMT

యశ్ ‘టాక్సిక్’ థియేటర్లలోకి రావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ కూడా పెరుగుతోంది. ఇప్పుడు వచ్చిన ట్రేడ్ అప్‌డేట్ ప్రకారం బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్ కలిపి చివరి ఒక్క గంటలోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ముందు రోజు రాత్రి ఈ స్థాయిలో సేల్స్ రావడంతో డే 1 ఓపెనింగ్ లెక్కలు మరింత పెరుగుతున్నాయి.

ఈ స్పీడ్ ఒక్కసారిగా మొదలైంది కాదు. మంగళవారం ఉదయం నాటికే బుక్‌మైషోలో ‘టాక్సిక్’ 6.83 లక్షలకు పైగా టికెట్లు అమ్మి, ఆ ప్లాట్‌ఫామ్ ఆల్‌టైమ్ అడ్వాన్స్ సేల్స్ టాప్ 10లోకి వెళ్లింది. అప్పటికే ‘కల్కి 2898 ఏడీ’, ‘జైలర్’ బుక్‌మైషో అడ్వాన్స్ టికెట్ నంబర్స్‌ను దాటింది. ఇప్పుడు చివరి గంటల్లో సేల్స్ మరింత స్పీడ్ గా పెరుగుతున్నాయి.

ఇక అన్ని ట్రాక్డ్ బుకింగ్స్ కలిపి చూస్తే నంబర్ ఇంకా పెద్దగా ఉంది. మంగళవారం రాత్రి అందుబాటులో ఉన్న ట్రేడ్ డేటా ప్రకారం తొలి రోజు కోసం దేశవ్యాప్తంగా 19 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. దాదాపు 25 వేల షోలు ట్రాకింగ్‌లో ఉండగా, అడ్వాన్స్ గ్రాస్ రూ.60 కోట్ల మార్క్ దాటింది. రిలీజ్ సమయానికి ముందు మరిన్ని షోలు ఓపెన్ అవుతుండటంతో ఈ లెక్క ఇంకా మారనుంది.

కర్ణాటకలో యశ్ మార్కెట్ ఎలా ఉంటుందో ముందే తెలుసు. కానీ ‘టాక్సిక్’కు హిందీ మార్కెట్ నుంచి కూడా పెద్ద నంబర్స్ రావడం డే 1కు కీలకం. మంగళవారం ఉదయం వరకే హిందీ వెర్షన్ రూ.15 కోట్లకు పైగా అడ్వాన్స్ చేసింది. బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, పుణెతో పాటు ప్రీమియం ఫార్మాట్స్‌లో కూడా షోలు పెరిగాయి.

ఇక్కడ మరో లెక్క యశ్ గ్యాప్. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తర్వాత నాలుగేళ్లకు ఆయన మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాడు. పైగా ఈసారి ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ కొనసాగింపు కాదు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో పూర్తిగా కొత్త గ్యాంగ్‌స్టర్ ప్రపంచంతో ‘టాక్సిక్’ వస్తోంది. అయినా అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర యశ్ పేరు మొదటి రోజు వరకు భారీగా పని చేసింది.

ఇప్పుడు అడ్వాన్స్ నంబర్ కంటే రిలీజ్ రోజు కౌంటర్ సేల్స్ ఎక్కడికి వెళ్తాయన్నదే పెద్ద లెక్క. చివరి గంటలోనే లక్ష టికెట్లు వెళ్లే స్పీడ్ కొనసాగితే ఉదయం షోల నుంచి మరో జంప్ రావచ్చు. రూ.100 కోట్ల వరల్డ్‌వైడ్ డే 1 గురించి ఇప్పటికే ట్రేడ్‌లో అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్ 2’ తర్వాత యశ్ మరోసారి ఆ క్లబ్‌లోకి ఎంత పెద్ద నంబర్‌తో వస్తాడన్నది చూడాలి.

Tags:    

Similar News