నేను ఎలాగూ ఇలాంటి కామెడీ కథలు రాయలేను: సందీప్ వంగా
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస పాన్-ఇండియా సంచలన విజయాలతో అత్యున్నత స్థాయికి చేరుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కిన కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం `రోమాంచకం`.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస పాన్-ఇండియా సంచలన విజయాలతో అత్యున్నత స్థాయికి చేరుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కిన కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం `రోమాంచకం`. తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమాలను నిరంతరం ప్రోత్సహిస్తూ అగ్రగామిగా నిలిచిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా.. ఈ చిత్రాన్ని తమ స్వంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా.. కొత్త దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రంతో పరిశ్రమకు పరిచయమవుతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ `రోమాంచకం` థియేట్రికల్ ట్రైలర్‌ను అత్యంత ఘనంగా విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే ఇది ప్రేమ.. హృద్యమైన వినోదం ..కొన్ని థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఒక క్లీన్ అండ్ నీట్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతోంది.
కథ విషయానికి వస్తే.. డేటింగ్ యాప్ సర్వీస్‌ను అందించే ఒక స్టార్టప్‌ను నడిపే కథానాయకుడు (హీరో), తన రీసెర్చ్‌లో భాగంగా చెన్నైకి చెందిన కథానాయిక (హీరోయిన్)తో ప్రేమలో పడతాడు. సాధారణ కథనం కంటే కూడా.. నిరంతరం ఎనర్జీ, అల్లరి..డుపుబ్బ నవ్వించే రోలర్ కోస్టర్ రైడ్‌లాంటి వైబ్‌తో ట్రైలర్ కట్ చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రధాన జంట మధ్య వచ్చే వైరుధ్యాలు..అలాగే కథానాయకుడు తన స్నేహితుల బృందంతో కలిసి చిక్కుల్లో పడే పరిస్థితుల ఆధారంగా వచ్చే వరుస కామెడీ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వుల విందు అందించబోతున్నాయి. ఇప్పటివరకు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ నుంచి వచ్చిన సీరియస్ ఇంటెన్స్ యాక్షన్ సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం చాలా కలర్‌ఫుల్‌గా.. రిఫ్రెషింగ్‌గా కనిపిస్తోంది. ఈ ఆకట్టుకునే యూత్‌ఫుల్ ఫన్ రైడ్ సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్రకథానాయకుడు సుమంత్ ప్రభాస్, అనంతిక సహా దర్శకనిర్మాతలు సినిమా విజయంపై ధీమాను కనబరిచారు.
ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని సందీప్ వంగా ఈ వేడుకలో వ్యాఖ్యానించారు. తాను ఇలాంటి కామెడీ కథలు ఎలాగూ రాయలేను గనుక సినిమాను నిర్మించానని సందీప్ వంగా తెలిపారు. దర్శకుడు కథ వినిపించినంతసేపూ తాను నవ్వుతూనే ఉన్నానని వంగా వెల్లడించాడు.