ఇరుముడి బుకింగ్స్.. పెద్ద సినిమాల మధ్యలోకి వచ్చేసిందే!

ఇప్పుడు సినిమా థియేటర్లలోకి వచ్చాక బుక్‌మైషోలో గంటకు అమ్ముడవుతున్న టికెట్ల సంఖ్య కూడా పెరిగింది.

Update: 2026-08-21 09:55 GMT

‘ఇరుముడి’ రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి స్పీడ్ చూపించింది. ఇప్పుడు సినిమా థియేటర్లలోకి వచ్చాక బుక్‌మైషోలో గంటకు అమ్ముడవుతున్న టికెట్ల సంఖ్య కూడా పెరిగింది. లేటెస్ట్‌గా ఒక గంటలో 32.5 వేల టికెట్లు అమ్ముడవడంతో తెలుగు సినిమాల బుక్ మై షో హవర్లీ పీక్ లిస్టులో ‘ఇరుముడి’ ఎనిమిదో స్థానానికి చేరింది. పైగా ప్రస్తుతం సేల్స్ కొనసాగుతున్నాయి కాబట్టి ఈ నంబర్ ఇక్కడే ఆగుతుందా లేదా అన్నది చూడాలి.

ఈ రికార్డులో ఎక్కువగా భారీ సినిమాలే కనిపిస్తాయి. ‘పుష్ప 2’, ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ లాంటి పాన్ ఇండియా సినిమాలు టాప్‌లో ఉన్నాయి. వాటి తర్వాత కూడా పెద్ద హీరోల సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి ‘ఇరుముడి’కి రిలీజ్‌కు ముందే బుకింగ్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ కలిపి లక్షకు పైగా టికెట్లు అడ్వాన్స్‌గా అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. నార్త్ అమెరికాలో కూడా ప్రీ సేల్స్ 225K డాలర్ల మార్క్ దాటాయి. ఇప్పుడు రిలీజ్ రోజు హవర్లీ సేల్స్ కూడా అదే స్పీడ్‌లో పెరిగాయి.

మరోవైపు మొదటి షోల నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమోషనల్ పార్ట్, క్లైమాక్స్‌తో పాటు రవితేజ పాత్ర గురించి సోషల్ మీడియాలో మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఈ టాక్ మధ్యాహ్నం, ఈవెనింగ్ షోలకు ఎంత వరకు ఉపయోగపడుతుందనేది కీలకం. ఎందుకంటే ప్రస్తుతం నమోదైన 32.5 వేల పీక్ ఇంకా పెరిగితే ‘ఇరుముడి’ లిస్టులో మరికొన్ని సినిమాలను దాటే అవకాశం ఉంది.

బీఎంఎస్ హవర్లీ పీక్‌లో టాప్ 10 తెలుగు సినిమాలు

పుష్ప 2: 1.07 లక్షల టికెట్లు

కల్కి 2898 ఏడీ: 95.7 వేల టికెట్లు

సలార్: 54.7 వేల టికెట్లు

పెద్ది: 47.3 వేల టికెట్లు

ది రాజాసాబ్: 44.3 వేల టికెట్లు

దేవర: 38 వేల టికెట్లు

గేమ్ ఛేంజర్: 36.7 వేల టికెట్లు

ఇరుముడి: 32.5 వేల టికెట్లు

మన శంకర వరప్రసాద్ గారు: 31.6 వేల టిక్కెట్లు

OG: 28.8 వేల టిక్కెట్లు

ప్రస్తుతానికి ‘ఇరుముడి’ ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే సినిమా ఇంకా మొదటి రోజులోనే ఉండటంతో ఫైనల్ పీక్ ఎంత వరకు వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేం. 36.7 వేల దగ్గర ఉన్న ‘గేమ్ ఛేంజర్’, 38 వేల దగ్గర ఉన్న ‘దేవర’ నంబర్స్ కూడా మరీ దూరంలో లేవు. రిలీజ్ రోజు టాక్‌తో బుకింగ్స్ ఇదే స్పీడ్‌లో కొనసాగితే ‘ఇరుముడి’ ఈ లిస్టులో ఇంకాస్త పైకి వెళ్లినా ఆశ్చర్యం ఉండదు.

Tags:    

Similar News