1 మిలియన్ రికార్డ్.. వర్కింగ్ డేలోనూ 'ఇరుముడి' స్పీడ్
ఓవర్సీస్‌లో కూడా ‘ఇరుముడి’ మంచి మార్క్ అందుకుంది. నార్త్ అమెరికాలో రవితేజ కెరీర్‌లో తొలిసారి మిలియన్ డాలర్ గ్రాస్ చేసిన సినిమాగా నిలిచింది.
‘ఇరుముడి’కి మొదటి వీకెండ్ వరకే మంచి రన్ ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు వర్కింగ్ డేలో కూడా బుకింగ్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. సినిమాకు వచ్చిన మౌత్ టాక్ ఇంకా పని చేస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఉండటంతో ఉదయం నుంచి నైట్ షోల వరకు డిమాండ్ తగ్గడం లేదు. రవితేజకు చాలాకాలం తర్వాత ఇలా వీకెండ్ దాటాక కూడా కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే సినిమా పడింది.
బుక్‌మైషోలో కూడా ప్రస్తుతం సినిమా స్పీడ్ బాగానే ఉంది. లేటెస్ట్ గా గంటలోనే 13 వేలకుపైగా టికెట్లు బుక్ అయినట్లు కనిపిస్తోంది. అసలైతే శుక్రవారం, శనివారం, ఆదివారం బుకింగ్స్ ఎక్కువగా ఉండటం కామన్. కానీ వర్కింగ్ డేలో కూడా గంటకు ఇన్ని టికెట్లు అమ్ముడవుతుండటం మామూలు విషయం కాదు. సినిమా మీద జనాల ఇంట్రెస్ట్ ఇంకా తగ్గలేదని చెప్పొచ్చు. సినిమా చూసిన వాళ్ల నుంచి వస్తున్న మాట కూడా కొత్త ఆడియన్స్‌ను థియేటర్‌కు తీసుకొస్తోంది.
ఓవర్సీస్‌లో కూడా ‘ఇరుముడి’ మంచి మార్క్ అందుకుంది. నార్త్ అమెరికాలో రవితేజ కెరీర్‌లో తొలిసారి మిలియన్ డాలర్ గ్రాస్ చేసిన సినిమాగా నిలిచింది. రవితేజకు అక్కడ ఇంతవరకు రాని లెక్క ఇది. ఆయన సినిమాలకు ఓవర్సీస్‌లో ఒక స్థాయి వరకు మాత్రమే మార్కెట్ ఉంటుందనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ‘ఇరుముడి’ ఆ రేంజ్‌ను కాస్త పైకి తీసుకెళ్లింది.
ఇక్కడ సినిమా జానర్ కూడా ఉపయోగపడింది. ఇది పూర్తిగా మాస్ సినిమా కాదు. రవితేజ ఇమేజ్‌కు తగ్గ సీన్స్ ఉన్నా, ఫ్యామిలీ ఎమోషన్‌కు కూడా మంచి స్పేస్ ఉంది. అదే కారణంగా ఫ్యామిలీతో వచ్చే ప్రేక్షకులు కూడా సినిమాను ఎంచుకుంటున్నారు. ఓవర్సీస్‌లో కూడా ఇలాంటి ఎమోషనల్ సినిమాలకు మంచి రన్ దొరుకుతోంది. ‘ఇరుముడి’కి కూడా ఆ లైన్ కలిసొచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు తర్వాత బుకింగ్స్ పెరగడం ఇప్పటికే కనిపించింది. ఆదివారం మంచి జంప్ వచ్చింది. ఇప్పుడు వర్కింగ్ డేలో కూడా టికెట్ సేల్స్ తగ్గకుండా ఉండటం వల్ల సినిమా రెండో వారానికి వెళ్లే బలం తెచ్చుకుంటోంది. ముఖ్యంగా రవితేజ గత కొన్ని సినిమాలు మొదటి వీకెండ్ తర్వాత త్వరగా డ్రాప్ అయ్యాయి. ‘ఇరుముడి’ మాత్రం ఆ ట్రెండ్‌ను మార్చేలా నడుస్తోంది.
ఇక రెండు రోజుల్లో ‘టాక్సిక్’ వస్తోంది. దాంతో కొన్ని స్క్రీన్స్ తగ్గడం తప్పదు. కానీ ‘ఇరుముడి’కి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి పూర్తిగా షోలు కోల్పోయే పరిస్థితి ఉండకపోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం, వీకెండ్ షోలలో ఆక్యుపెన్సీ అలాగే ఉంటే రెండో వారంలో కూడా మంచి రన్ దొరుకుతుంది.