డ్రగ్స్ ని అంతమొందించేందుకు సోల్జర్స్ లా పనిచేద్దాం : రామ్ చరణ్

వాటి కన్నా పేరెంట్స్ తో గడపడం వల్ల హై వస్తుంది. ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడం.. గేమ్స్ ఆడటం వల్ల హై వస్తుందని అన్నారు చరణ్.;

Update: 2025-06-26 15:48 GMT

యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఆధర్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విజయ్ దేవరకొండ అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా చరణ్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.

తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చూస్తుంటే తనకు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయని అన్నారు చరణ్. చిన్నప్పుడు ఇలాంటి అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే వాడిని.. ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

రైజింగ్ తెలంగాణా పేరుతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి థాంక్స్. ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు చరణ్. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కి బానిస అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయి. తాను చిన్నతనంలో స్కూల్ బయట గోలి సోడాలు తినేవాళ్లం ఇప్పుడు అదే ప్లేస్ లో డ్రగ్స్ ఇస్తున్నారు. పిల్లల ఐస్ క్రీమ్ లో ఏం కలుపుతున్నారో కూడా తెలియట్లేదని అన్నారు చరణ్.

వాటి కన్నా పేరెంట్స్ తో గడపడం వల్ల హై వస్తుంది. ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడం.. గేమ్స్ ఆడటం వల్ల హై వస్తుందని అన్నారు చరణ్. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఒక తండ్రిగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. డ్రగ్స్ కి దూరంగా ఉండాలని దీనికి అందరు కూడా సోల్జర్ గా పోరాటం చేద్దామని అన్నారు రాం చరణ్.

ఇలాంటి అవేర్ నెస్ కార్యక్రమాలకు సినీ సెలబ్రిటీలను తీసుకు రావడం వల్ల విషయం మరింత ప్రజల్లోకి వెళ్తుందని తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ పాల్గొన్నారు. ఐతే సినిమా పరిశ్రమ నుంచి ఎఫ్.డీ.సీ చైర్మన్ దిల్ రాజు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఎవరైనా పరిశ్రమకు సంబంధించిన వారు డ్రగ్స్ వాడినట్టు ప్రూవ్ అయితే వారిని బ్యాన్ చేస్తామని అన్నారు.

Tags:    

Similar News