బాలీవుడ్ స్టార్లపై నెటిజన్లు ఫైర్
పాక్ ఆర్టిస్టులు తమ దేశం తరపున మాట్లాడుతున్నప్పటికీ బాలీవుడ్ లో కొంతమంది తప్పించి వారి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎవరూ మాట్లాడలేదు.;
జమ్మూ లోని పహల్గామ్ ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా ఇండియా చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోని ఆర్టిస్టుల అసోసియేషన్ లు కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే పాకిస్తానీ ఆర్టిస్టులను పూర్తిగా నిషేధించడంతో పాటూ కొన్ని కఠిన నిర్ణయాలు, నిబంధనలను విధించారు.
ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఆల్రెడీ పాకిస్తానీ నటులు ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ "భారత వ్యతిరేక" వ్యాఖ్యలు చేయడాన్ని విమర్శించడంతో పాటూ పాకిస్తానీ ఆర్టిస్టులను దేశంలో పూర్తిగా నిషేధించాలనే దీర్ఘకాల డిమాండ్ ను కూడా అసోసియేషన్ పునరుద్ఘాటిస్తూ ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది.
మహీరాఖాన్ ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ ను పిరికితనమని పేర్కొందని, ఫహద్ ఖాన్ ఉగ్రవాదాన్ని ఖండించకుండా విభజన కథనాలకు మద్దతు ఇస్తున్నారని ఆ నోట్ లో ప్రస్తావించారు. ప్రస్తుతం పాకిస్తానీ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, ఫైనాన్షియర్లు ఇండియాలో సినిమాలు చేయకుండా AICWA కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపింది.
పాక్ ఆర్టిస్టులు తమ దేశం తరపున మాట్లాడుతున్నప్పటికీ బాలీవుడ్ లో కొంతమంది తప్పించి వారి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎవరూ మాట్లాడలేదు. అందరూ ఈ విషయంలో సైలెంట్ గా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఇలాంటి వాటిపై రెస్పాండ్ అవడం వల్ల వారి ఫ్యూచర్ కు ఇబ్బంది వస్తుందేమో అనే కారణంతో చాలా మంది రెస్పాండ్ అవట్లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దానికి కారణం చాలా మంది సెలబ్రిటీలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో అసోసియేట్ అయి ఉండటం మరియు ఈ విషయంపై ఏదైనా మాట్లాడితే వారికి తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ నుంచి మద్దతు కోల్పోతారనే కారణంతో ఈ విషయంపై మాట్లాడటానికి సిద్ధంగా లేరు. ఎవరైనా సరే తన పబ్లిక్ ఇమేజ్ గురించి పట్టించుకోవడం మామూలే కానీ రానున్న రోజుల్లో ఇదెంత వరకు వెళ్తుందనేది చూడాలి. అయితే ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని అక్కడి హీరోలు ఎంతో చేశారు. కాబట్టి వారిపై సోషల్ మీడియాలో ఈ రకమైన కామెంట్స్ ను చేయడం ఆపేస్తే బెటర్. ఆల్రెడీ ఇండియాను SRK దేశంగా పిలుస్తారనే విషయం తెలిసిందే.